కేజీఎఫ్ 2 ని బ్రేక్‌ చేయడం మిస్టర్ పర్ఫెక్ట్ ఖాన్‌ కు సాధ్యమేనా

Update: 2022-05-02 02:30 GMT
అమీర్ ఖాన్‌ దంగల్‌ సినిమాతో అత్యధిక వసూళ్ల రికార్డును ఇన్నాళ్లు అట్టిపెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ రికార్డ్‌ ను యశ్‌ తన కేజీఎఫ్ 2 తో సొంతం చేసుకున్నాడు. దంగల్ సినిమా రికార్డులను ఇప్పట్లో ఏ ఇండియన్ సినిమా కూడా బ్రేక్ చేయలేదు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కేజీఎఫ్ 2 సినిమా తో యశ్‌.. ప్రశాంత్‌ నీల్ ల జోడీ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.

కేజీఎఫ్ 2 బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద టార్గెట్‌ ను క్రియేట్‌ చేసింది. అంతే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుని మరే సినిమాకు కూడా ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అమీర్ ఖాన్‌ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కేజీఎఫ్‌ 2 రికార్డ్‌ బద్దలు కాబోతున్నట్లుగా బలంగా నమ్ముతున్నారు.

మిస్టర్ పర్ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్‌ చద్దా విడుదలకు సిద్దంగా ఉంది. ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న లాల్‌ సింగ్‌ చద్దా తో అమీర్ ఖాన్ మళ్లీ తన రికార్డును తాను పదిలం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా విశ్వాసం ను వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్‌ 2 బ్రేక్ చేసిన దంగల్‌ రికార్డు ను మళ్లీ అమీర్ ఖాన్‌ మాత్రమే సొంతం చేసుకుంటాడు అంటూ కొందరు ఆయన అభిమానులు భావిస్తున్నారు.

హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్ కు రీమేక్ గా రూపొందిన లాల్‌ సింగ్‌ చద్దా సినిమా ఒక భారీ యాక్షన్ సినిమా కాదు.. ఒక మంచి ఫీల్‌ గుడ్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌. ఈమద్య కాలంలో బాలీవుడ్‌ ప్రేక్షకులు పుష్ప.. కేజీఎఫ్ 2.. ఆర్ ఆర్ ఆర్‌ వంటి భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న మాస్ సినిమాలను ఇష్టపడుతున్నారు. కనుక లాల్‌ సింగ్‌ చద్దా సినిమా కామెడీతో రికార్డు ను బ్రేక్ చేయడం ఎంత వరకు సాధ్యం అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అమీర్‌ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీ నటులు కనిపించబోతున్నారు. కేవలం హిందీలోనే కాకుండా ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో అంటే సౌత్‌ లో కూడా విడుదల చేయబోతున్నారు. సౌత్‌ లో మినిమం వసూళ్లు దక్కించుకుంటే అప్పుడు లాల్‌ సింగ్‌ చద్దా సక్సెస్ అయినట్లే అంటున్నారు.

ఇక హిందీ వర్షన్‌ ఒక్కటే 400 కోట్ల వసూళ్లు సాధిస్తే అప్పుడు సరికొత్త రికార్డును నమోదు చేసినట్లుగా అవుతుంది. మరి అది సాధ్యమా అంటే కాదనే ఎక్కువ శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది. ఇప్పటి నుండే ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనుక  అమీర్ ఖాన్‌ ఆ మార్క్ ను సాధిస్తాడా అనేది చూడాలి.
Tags:    

Similar News