'లాల్ సింగ్ చ‌ద్దా' ఓటీటీ రైట్స్ ఎంత‌?

Update: 2022-07-31 08:30 GMT
క‌రోనా స‌మ‌యంలో.. క‌రోనా త‌రువాత చాలా వ‌ర‌కు పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు ఓటీటీలు భారీ స్థాయిలో పుంజుకున్నాయి. రికార్డు స్థాయిలో వినియోగ‌దారుల‌ని సొంతం చేసుకున్నాయి. క్ర‌మ క్ర‌మంగా జ‌నం ఓటీటీల‌కు అల‌వాటుప‌డ‌టంతో థియేట‌ర్ వ్య‌వ‌స్థ చాలా వ‌ర‌కు ప్ర‌మాదంలో ప‌డిపోయింది. ఎంత పెద్ద స్టార్ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైనా గ‌తంలో థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన ప్రేక్ష‌కులు ఆ స్థాయిలో ఆస‌క్తిని చూపించ‌డం లేదు.

ఈ ప‌రిస్థితిలో మార్పులు రావాలంటే స్టార్ హీరోల సినిమాల‌ని 10 వారాల త‌రువాతే ఓటీటీల‌కు ఇవ్వాల‌ని టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో బాఈవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. త‌ను న‌టించిన లేటెస్ట్ మూవీ `లాల్ సింగ్ చ‌ద్దా`. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌రీనా క‌పూర్ హీరోయిన్‌గా న‌టించింది. ఇదే మూవీతో టాలీవుడ్ హీరో నాగ‌చైత‌న్య బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే.

హాలీవుడ్ హీరో టామ్ హంక్స్ న‌టించిన `ఫారెస్ట్ గంప్‌` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. అయితే య‌దా త‌దంగా కాకుండా హిందీకి కొంత వ‌ర‌కు మార్చారు. ఆ బాధ్య‌త‌ల్ని న‌టుడు అతుల్ కుల‌క‌ర్ణి తీసుకుని చాలా వ‌ర‌కు మార్పులు చేర్పులు చేశారు. `థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్‌` డిజాస్ట‌ర్ త‌రువాత చాలా గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ ఈ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ మూవీపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ మూవీని తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. ఆగస్టు 11న విడుద‌ల‌వుతున్న ఈ మూవీని వెంట‌నే ఓటీటీకి ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ సినిమాని 6 నెల‌ల త‌రువాతే ఓటీటీకి ఇవ్వాల‌ని హీరో అమీర్ ఖాన్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ ఒప్పందానికి ఓకే చెప్పిన నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల్ని రూ. 160 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్టుగా తెలుస్తోంది.

బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అన్ని భాష‌ల‌కు క‌లిపి నెట్ ఫ్లిక్స్ ఈ మూవీకి రూ. 160 కోట్లు చెల్లించింద‌ని చెబుతున్నారు. ఇది నిజంగా రికార్డే. అంతే కాకుండా ఆరు నెల‌ల త‌రువాత డీల్ కి నెట్ ఫ్లిక్స్ ఇంత భారీ మొత్తాన్ని అన్ని భాష‌ల‌కు క‌లిపి అందించ‌డం విశేషం అని కూడా ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News