అమీర్ సీక్రెట్ గా 500 కోట్లు లాగేసాడు

Update: 2018-02-03 07:48 GMT
అమీర్ ఖాన్ ని సూపర్ స్టార్ అని ఊరికే అనలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా తనకు మాత్రమే సాధ్యం అనిపించే కథలతో మాయ చేయటం మరో బాలీవుడ్ హీరో వల్ల కాలేదు అనేదాంట్లో అతిశయోక్తి లేదు. రంగ్ దే బసంతి, లగాన్, దిల్ చాహతా హై, మంగల్ పాండే, దంగల్, పికె లాంటి సినిమాలతో ఇది పదే పదే ఋజువు చేస్తూనే ఉన్నాడు అమీర్. అందుకే అతనికి దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఫాన్స్ ఉన్నారు. అమీర్ ఖాన్ ఇప్పుడు చైనాలో కూడా తన జెండా బలంగా పాతుతున్నాడు. దంగల్ తో పదిహేను వందల కోట్లు ఒక్క చైనాలోనే కొల్లగొట్టి అక్కడి వారితో శెభాష్ అనిపించుకున్న అమీర్ ఇప్పుడు సీక్రెట్ సూపర్ స్టార్ తో మరోసారి అదే ఫీట్ రిపీట్ చేస్తున్నాడు. రెండు వారాల క్రితం విడుదలైన సీక్రెట్ సూపర్ స్టార్ కు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.

విడుదలైన రెండు వారాల తర్వాత చాలా స్టడీగా ఉన్న సీక్రెట్ సూపర్ స్టార్ ఇప్పటి దాకా 500 కోట్లు రాబట్టి కొత్త సెన్సేషన్ సృష్టించింది. అమీర్ ఖాన్ ది ఇందులో హీరో పాత్ర కాదు. సినిమా మొత్తం కనిపించడు. లీడ్ హీరొయిన్ జైరా వాసింకు చేయూతనిచ్చి తను గొప్ప స్థాయికి రావడానికి సహాయపడే సపోర్టింగ్ అరిస్ట్ గా మాత్రమే నటించాడు. అయినా కూడా తమకు కావలసిన ఎమోషన్స్ పుష్కలంగా ఉండటంతో చైనీయులు సినిమాని విపరీతంగా ఆదరిస్తున్నారు. మొత్తంగా దంగల్ తెచ్చిన దాంట్లో సగం అంటే 750 కోట్ల దాకా సీక్రెట్ సూపర్ స్టార్ రాబట్టవచ్చు అని ట్రేడ్ అంచనా.

ఒకపక్క చైనాతో లోలోపల అంతర్యుద్ధం కొనసాగుతూ ఉంటే అక్కడి వాళ్ళు మాత్రం మన సినిమాలను నెత్తి బెట్టుకుంటున్నారు. బాహుబలి కూడా ఆడేది కాని ఆ తరహా ఫాంటసీ సినిమాలు వాళ్ళకు అలవాటే. అందుకే ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉండే ఇలాంటి సినిమాలకు పట్టం కడుతున్నారు. అమీర్ ఖాన్ నెక్స్ట్ మూవీ తగ్స్ అఫ్ హిందూస్తాన్ మీద అప్పుడే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ డిమాండ్ ఏర్పడిందట. అమీర్ ఖానా మజాకా. మరో ట్విస్ట్ ఏంటంటే చాన్నాళ్ళ క్రితం వచ్చిన తారే జమీన్ పర్ ఇప్పుడు చైనా కోసం మళ్ళి విడుదల చేస్తారట. అంతే మరి. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి.
Tags:    

Similar News