అల్లరి రవిబాబు తెరకెక్కించిన `అవును` ఫ్రాంఛైజీ సినిమాల గురించి తెలిసిందే. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ ఫ్రాంఛైజీ లో మొదటిది మాత్రమే బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత ప్రయత్నాలన్నీ ఫ్లాపులే. సురేష్ బాబుతో కలిసి రవిబాబు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయ. ఇన్నోవేటివ్ గా ఆలోచించే రవిబాబు రొటీనిటీలో పడి ఫ్లాప్ లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఈసారి కొలీగ్ ని మార్చి ప్రత్యేకించి దిల్ రాజుతో కలిసి మరో ప్రయత్నం చేస్తున్నారు. కాంపౌండ్ మారినా ఈసారి కూడా హారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి దిల్ రాజు- రవిబాబు నిర్మాతలుగా కొనసాగుతుండడం ఆసక్తికరం.
అదేమిటో గత కొంతకాలంగా రవిబాబు ఆవిరి టీజర్ల పేరుతో వరుసగా ఏదో ఒక వీడియోని రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. వీటిలో ఎక్కడా ఇన్నోవేషన్ అయితే కనిపించడం లేదు. మళ్లీ అదే పాత పంథాలో ఇంట్లో వస్తువులన్నీ కదిలిపోతున్నాయి. ఏదో ఆత్మ వాటన్నిటినీ కదిలించడం విసిరేయడం లాంటి పనులన్నీ చేస్తోంది. ఇంకొంచెం అడ్వాన్స్ డ్ గా ట్రైలర్ లో ఏమైన చూపించాడా అని వెతికితే అందులోనూ ఏమీ లేదు. ఆ ఆత్మ ప్లేట్లు విసిరేయడం.. బొమ్మలు విసిరేయడం.. యాక్టివాను నడిపించేయడం చేస్తోంది. చిన్నారి మున్నికి మాత్రమే కనిపించే దెయ్యం బోలెడన్ని విన్యాసాలు చేస్తోంది. ఇక ఉన్నట్టుండి మున్ని మిస్సయితే కంగారు పడే పేరెంట్స్ గా రవిబాబు-నేహా చౌహాన్ కనిపిస్తున్నారు. అసలు పాపను వెంటాడే ఆ ఆత్మ వెనక సీక్రెట్ ఏమిటి? అసలు ఆ ఇంట్లోనే ఆవిరి దెయ్యం ఎందుకు ఉంది? దాని వెనక మిస్టరీ ఏమిటి? అన్నదే సినిమా. మొత్తానికి ట్రైలర్ తోనే రవిబాబు కథ మొత్తం క్లియర్ కట్ గా ఎలాంటి సస్పెన్స్ లేకుండా రివీల్ చేసేశాడు. ఇందులోనే రవిబాబు సెంటిమెంటు డైలాగులు కాస్త వింతగానే అనిపిస్తోంది.
అయితే ఈ ట్రైటర్ ని బట్టి.. ఈసారి చెమటలు పట్టించే దెయ్యాన్ని కాదు... ఆవిరి పట్టించే దెయ్యాన్ని చూపిస్తున్నాడా? అన్నది పూర్తి గా చూస్తే కానీ చెప్పలేం. ఆవిరి టైటిల్ కి తగ్గట్టు ఒక చెక్క గదిలో హోల్స్ నుంచి ఆవిరి వచ్చేస్తోంది. అందులోంచి ఓ చెయ్యి కూడా బయటకు రావడం.. వగైరా ట్విస్టులున్నాయి. ఇది కూడా ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం! తరహాలోనే యథావిధిగానే రొటీన్ కథతో తెరకెక్కింది. కళ్లు తిప్పుకోనివ్వనంతగా రవిబాబు ఏం చూపించబోతున్నాడు? ఎమోషన్ ఎంత వర్కవుటైంది? ఎంతగా భయపెట్టారు? అన్నది పూర్తి సినిమా చూసి చెప్పాలి. అక్టోబర్ 18న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ చిత్రానికి రవిబాబు స్వయంగా కథ-కథనం అందించారు. శ్రీ ముక్త- భవానీ శంకర్-ముక్తార్ ఖాన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Full View