వీలైతే నాలుగు మాటలు .. కుదిరితే కప్పు కాఫీ... అంటూ సిద్ధార్థ్ ప్రపోజ్ చేశాడు కదూ? బొమ్మరిల్లు చిత్రంలో హాసినిని బుట్టలో వేయడానికి ఇలాంటి మాటలు చాలానే చెప్పాడు సిద్ధూ. అయితే ఈ డైలాగ్ క్రియేట్ చేసింది ఎవరు? పేరు అబ్బూరి రవి. బొమ్మరిల్లులో ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో ఎమోషనల్ డైలాగ్స్ క్రియేట్ చేసింది ఈయనే. ఇంకా నా చెయ్యి నీ చేతుల్లోనే ఉంది నాన్నా అంటాడు సిద్ధూ.. ఇలాంటి మ్యాజికల్ డైలాగ్స్ వల్లే ఆ సినిమా అంత పెద్ద హిట్టయ్యింది. మాటల రచయిత గా అబ్బూరి రవి అంత పెద్ద స్థాయిలో ఉన్నాడు అని ప్రూవ్ చేసిందా చిత్రం.
పల్లకిలో పెళ్లికూతురు - కిక్కు - భగీరథ - అన్నవరం - అతిధి - డాన్ - మిస్టర్ పెర్పెక్ట్ - దడ చిత్రాలకు మాటలు రాశారాయన. అంతేకాదు.. అబ్బూరి లేటెస్టుగా ఉలగనాయగన్ కమల్ హాసన్ హీరోగా నటించి నిర్మించిన చీకటిరాజ్యం చిత్రానికి మాటలు అందించారు. తెలుగు వెర్షన్ బాధ్యత ఆయనే భుజాన వేసుకున్నారు. కేవలం మాటల వరకే కాదు - డబ్బింగు చెప్పారు. కొన్ని సీన్ లలో కూడా నటించారని కమల్ హాసన్ స్వయంగా చెప్పారు.
అంతేకాదు నిన్నటిరోజున చీకటిరాజ్యం ప్రమోషన్ కార్యక్రమాల్లో కమల్ హాసన్ ఓ మాట చెప్పారు. అబ్బూరి మా టీమ్ తో పాటే ఫ్యామిలీ సభ్యుడు అయిపోయాడు. అతడు గౌతమి జీవితంపై పుస్తకం రాస్తున్నాడు. మొదటి అధ్యాయంలోనే తన జీవితం మొత్తం రాసేశాడు. .. అంటూ చెప్పుకొచ్చారు. మరి పుస్తకం ఎప్పటికి పబ్లిష్ అవుతుందో? ఎప్పటికి రిలీజ్ చేస్తారో?