బాలీవుడ్‌లో అంతే మరి. సినిమా ఏమో చెత్తగా ఉందంటారు. కానీ ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సల్మాన్ ఖాన్ ప్రతి సినిమాకూ ఇలాగే జరుగుతుంటుంది. బాడీగార్డ్ దగ్గర్నుంచి కిక్ వరకు ప్రతి సినిమాకూ నెగెటివ్ రివ్యూసే వచ్చాయి. కానీ అవన్నీ అలవోకగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరాయి. ఇంకా ఎక్కువ వసూళ్లే సాధించాయి. ఐతే స్టార్ హీరోలెవరూ లేని సినిమా.. అందులోనూ విమర్శకులంతా వేస్ట్ అని తేల్చేసిన సినిమా ఒకటి ఇప్పుడు వంద కోట్ల క్లబ్‌లో చేరింది. అదే ఏబీసీడీ-2.
ఈ ఏడాది బాలీవుడ్‌లో వంద కోట్ల సినిమా పెద్దగా లేవు. మేలో 'పీకూ' వచ్చే వరకు ఏ సినిమా కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరలేదు. ఐతే పీకూతో పాటు తను వెడ్స్ మను రిటర్న్స్ కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు ఏబీసీడీ-2 కూడా ఆ క్లబ్‌లోకి చేరింది. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ సినిమా వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. ప్రభుదేవా ముఖ్య పాత్ర పోషించారు. ఐతే ఈ సినిమాలో విషయం లేదని.. చాలా డ్యాన్స్ వీడియోల్ని కలిపి సినిమాగా తీసినట్లుందని విమర్శకులు పెదవి విరిచారు. ఐతే ఆ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లు చూడ్డానికే జనాలు ఎగబడుతున్నారు. పది రోజులకే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీనికి ముందు వచ్చిన 'ఏబీసీడీ' కూడా ఇలాగే నెగెటివ్ టాక్‌తో మొదలై మంచి వసూళ్లే రాబట్టింది.