ఎన్టీఆర్ - పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘టెంపర్’ చిత్రం మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న టెంపర్ ను ప్రస్తుతం హిందీ మరియు తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. హిందీలో భారీ ఎత్తున ఈ చిత్రం రీమేక్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో కరణ్ జోహార్ ‘టెంపర్’ రీమేక్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ‘టెంపర్’ రీమేక్ ‘సింబ’ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రీమేక్ వచ్చే నెలలో విడుదల కాబోతుంది.
‘టెంపర్’ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ చాలా విలక్షణంగా నటించి మెప్పించాడు. ప్రకాష్ రాజ్ పాత్రను హిందీ రీమేక్ లో సోనూ సూద్ పోషించడం జరిగింది. అయితే సోనూ సూద్ కు ముందు ఆ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ మరియు మాధవన్ ను ఫిల్మ్ మేకర్స్ సంప్రదించినట్లుగా సమాచారం అందుతుంది. విలన్ పాత్ర అవ్వడంతో ఇద్దరు కూడా ఆసక్తి చూపలేదట.
‘సవ్యసాచి’ చిత్రంలో అప్పటికే విలన్ గా నటించిన మాధవన్ మరోసారి విలన్ గా నటించేందుకు ఆసక్తిని కనబర్చలేదు. ఇక అభిషేక్ బచ్చన్ వరుసగా సినిమాలకు కమిట్ అయిన కారణంగా ‘టెంపర్’ రీమేక్ లో విలన్ పాత్రను వద్దన్నట్లుగా చెబుతున్నారు. ‘సింబ’ విడుదలైన తర్వాత అభిషేక్ బచ్చన్ మరియు మాధవన్ లు మంచి పాత్రను మిస్ అయ్యామని అనుకుంటారా లేదంటే వదులుకున్నందుకు మంచే జరిగిందిలే అనుకుంటారో తెలియాలి అంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.