హిందీ భీమ్లా నాయక్‌ మళ్లీ మొదటికి

Update: 2021-08-29 05:19 GMT
మలయాళ సూపర్‌ హిట్ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ ను తెలుగు లో భీమ్లా నాయక్‌ గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేసి విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి భీమ్లా నాయక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లో రానా మరియు పవన్ కళ్యాణ్ లు నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సినిమా ను హిందీలో జాన్ అబ్రహం మరియు అభిషేక్ బచ్చన్ లు నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో కథనాలు వచ్చాయి.

జాన్ అబ్రహం మరియు అభిషేక్‌ బచ్చన్ ల కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు ఇప్పటికే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి వీరి కాంబో మూవీ తప్పకుండా ఆకట్టుకుంటుందని అంతా అనుకున్నారు. హిందీ వర్షన్‌ కు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరిగిందనే ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను ఆరంభంకు ముందు క్యాన్సిల్‌ అయ్యిందనే వార్తలు మీడియా వర్గాల్లో వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హిందీ లో రీమేక్ విషయం మళ్లీ వెనక్కు అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి.

అభిషేక్ బచ్చన్‌ ఇప్పటికే రెండు మూడు రీమేక్ లు చేస్తున్న కారణంగా డేట్లు క్లాష్‌ అవ్వడం వల్ల నో చెప్పాడా లేదంటే మొదటి నుండే ఈ సినిమా పై ఆసక్తిని కలిగి లేడా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ జూనియర్‌ బచ్చన్ తప్పుకుంటే హిందీ లో రూపొందాల్సిన భీమ్లా నాయక్‌ ను ఎవరు చేస్తారు అనేది ప్రస్తుతం ప్రశ్న. బాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో సౌత్‌ సినిమాల రీమేక్ లకు మంచి డిమాండ్ ఉంది. కనుక ఈ సినిమా ను ఖచ్చితంగా రీమేక్‌ చేయాలి అనేది చాలా మంది ఆలోచనగా తెలుస్తోంది.
Tags:    

Similar News