హిందీ చిత్రం `టూ స్టేట్స్` విడుదల కాగానే హిట్ టాక్ సొంతం చేసుకొంది. దీంతో అన్ని భాషలూ ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నించాయి. కానీ నిర్మాత కరణ్ జోహార్ ఒక పట్టాన తన సినిమాల రీమేక్ రైట్స్ అమ్మడు కదా... దీంతో ఆ సినిమా తెలుగు రీమేక్ చర్చల దశలోనే ఆగిపోయింది. అయితే ఎలా సొంతం చేసుకొన్నాడో తెలియదు కానీ... వినాయక్ శిష్యుడు వెంకట్ కుంచెం రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకొన్నాడు. అందుకు వినాయక్ కూడా సహకరించాడట. స్క్రిప్టుని సిద్ధం చేసుకొన్న వినాయక్ శిష్యుడు వెంకట్ దాన్ని అభిషేక్ పిక్చర్స్ దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్లకీ కథ నచ్చడంతో వెంకట్ కుంచెంని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమాని తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే నటీనటుల ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అర్జున్ కపూర్ లాంటి కథానాయకుడికోసం వెదుకులాట మొదలుపెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ కథని నానితో తీస్తే ఎలా ఉంటుందా అని చిత్రబృందం ఆలోచిస్తోందట. మరి అందుకు నాని ఒప్పుకొంటాడో లేదో చూడాలి.