మంచు విష్ణు హీరోగా కామెడీ సినిమాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి రూపొందించిన ఆచారి అమెరికా యాత్ర విడుదల విషయంలో ఇంకా సందిగ్ధం తొలిగిపోలేదు. ఏప్రిల్ 6 విడుదల అంటూ ఓ వారం ముందు వరకు కొంత హడావిడి చేసారు కాని యూనిట్ మళ్ళి సైలెంట్ అయిపోయింది. ఒక పక్క రంగస్థలం దుమ్ము దులుపుతోంది. ఓ రెండు వారాల దాక దీన్ని కంట్రోల్ చేయటం కష్టంగా ఉంది. దీనికి తోడు 5వ తేది నితిన్ చల్ మోహనరంగా అంటూ వస్తున్నాడు. పవన్ నిర్మాత కావడం వల్ల దీని మీద పవన్ ఫాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపధ్యంలో రిస్క్ ఎందుకులే అనే ఆలోచనలో ఆచారి టీం పడినట్టు తెలిసింది. సో మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి అంటే నెలాఖరుకు వెళ్లడమొకటే కనిపిస్తోంది. ఎందుకంటే 12న నాని కృష్ణార్జున యుద్ధం 20న భరత్ అనే నేను ఈపాటికే రంగం సిద్ధం చేసుకున్నాయి. వాటికి పోటీకి వెళ్ళడం ఎంత వరకు సేఫో ప్రత్యేకించి ఆ యూనిట్ కు చెప్పాల్సిన అవసరం లేదు.
అందుకే ఏప్రిల్ 27 ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు ఆచారి. నిజానికి ఆ డేట్ లో రజనీకాంత్ కాలా షెడ్యూల్ చేసారు. కాని తమిళనాడులో పరిస్థితి అనుకూలంగా లేదు. సమ్మె కొనసాగుతూనే ఉంది. మరో వారం పది రోజుల దాకా పరిష్కారం జరిగే సూచనలు కనిపించడం లేదు. కనీసం సినిమా ప్రమోషన్లు కూడా చేయకూడదని అక్కడి నిర్మాతలు కలిసి కట్టుగా ఒకే మాట మీదున్నారు. ఈ నేపధ్యంలో సెన్సార్ కాని కాలా సమ్మె కాగానే అతి తక్కువ వ్యవధిలో తక్కువ హైప్ తో విడుదల కావడం కష్టమే. అందుకే వాయిదా వేయక తప్పదని ధనుష్ ఆల్రెడీ డిసైడ్ అయ్యాడని కోలీవుడ్ టాక్. అందుకే ఆచారి అమెరికా యాత్ర ఆ డేట్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉంది. ఆపై వారానికే నా పేరు సూర్య ఉన్నప్పటికీ ఇది తప్ప వేరే మార్గం లేదు. తరువాతైనా వేరే సినిమాలు క్యు లో రెడీ ఉన్నాయి. ఇంకా మీనమేషాలు లెక్క వేసుకుంటూ కూర్చుకుంటే సమ్మర్ హాలిడేస్ కూడా పూర్తవుతాయి. అందుకే మరో రెండు రోజుల్లో దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
నిజానికి ఆచారి అమెరికా యాత్ర జనవరి చివరి వారం నుంచి ఇలా విడుదల వాయిదా వేసుకుంటూనే వస్తోంది. ట్రైలర్ కాస్త జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ ఛాయల్లో ఉందనే కామెంట్స్ వినిపించిన నేపధ్యంలో కొత్తగా అనిపించెందుకు డిఫరెంట్ ప్రమోషన్ ప్లాన్ చేసే పనిలో ఉంది టీం. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరొయిన్. హీరోతో సమానంగా జర్నీ చేసే పాత్రలో బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ ఇందులోనే చేయటం విశేషం.