మేలో రిలీజ్ కావాల్సిన `ఆచార్య` విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ ప్రభావంతో పెండింగ్ చిత్రీకరణకు చాలా సమయం పట్టనుందని అందుకు కొరటాల 2 నెలల టైమ్ అడిగారని తెలిసింది. అంతా సవ్యంగా సాగితే ఈ పాటికే ఈ సినిమా ప్రచారం పీక్స్ కి చేరుకునేది. కానీ కోవిడ్ అంతా మార్చేసింది. తాజా సమాచారం మేరకు ఆచార్య ను మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉందని గుసగుసలు వినిపించాయి.
అయితే పెద్ద సినిమాలపై ఉండే క్యూరియాసిటీ దృష్ట్యా అప్పటివరకూ చిత్రబృందం లీకుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అధికారికంగా ప్రచారం చేయాల్సిన కంటెంట్ సిద్ధంగా ఉంటే ఎల్లప్పుడూ ల్యాబుల నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఆచార్య గతంలో కంటే ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ విరామంలో దర్శకనిర్మాతల అప్రమత్తత చాలా అవసరం.
అయితే ఇలాంటి సమయంలో ఆచార్య నుండి రెండవ సింగిల్ చిన్న బిట్ ఆన్ లైన్ లో లీక్ అయింది. నీలంబరి.. అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. ఇది రామ్ చరణ్- పూజా హెగ్డే జంటపై రొమాంటిక్ నంబర్. లాహే లాహే తర్వాత ఆసక్తిని రేకెత్తించబోయే పాట ఇది. అయితే లీకులు కాకుండా అధికారికంగా అభిమానుల ముందుకు వస్తే బావుంటుంది.
ఆచార్యకు మణిశర్మ లాంటి సీనియర్ సంగీతం అందించడం పెద్ద ప్లస్ కానుంది. ఆయన మెలోడీ బ్రహ్మ కాబట్టి సంగీతం పరంగా అభిమానులు చాలా ఆశిస్తారు. మిర్చి- శ్రీమంతుడు- జనతా గ్యారేజ్-భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన కొరటాల చిరుకు కూడా ఇండస్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. చిరంజీవి - చరణ్ కాంబినేషన్ మూవీ కాబట్టి సంచలనాలు ఖాయమని అంచనా వేస్తున్నారు. కారణం ఏదైనా ఇలాంటి సమయంలో ఈ ఆలస్యం మెగాభిమానుల్లో విరహం పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.