అజిత్‌ లో ఈ టాలెంట్ కూడా ఉందా?

Update: 2018-05-07 11:48 GMT
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సింప్లిసిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను తన సినిమాల గురించి కానీ.. వ్యక్తిగత జీవితం గురించి కానీ ఏమీ మాట్లాడడు. ఏ వేడుకలకూ రాడు. తన గురించి తాను డబ్బా కొట్టుకోడు. అందరికీ నటుడిగా పరిచయం ఉన్న అజిత్ లో వేరే టాలెంట్స్ చాలా ఉన్న సంగతి చాలామందికి తెలియదు. వాటి గురించి ఎక్స్ పోజ్ కానివ్వడు అజిత్. అతను బైక్ రేసింగ్‌.. కార్ రేసింగ్ లో ప్రొఫెషనల్ అన్న సంగతి చాలామందికి తెలియదు. అలాగే అజిత్ పైలట్ కూడా. అతను ఫైటర్ జెట్ నడపగలడు. ఈ నేపథ్యంలో అతను మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) విద్యార్థులు డ్రోన్ తయారు చేసే ప్రాజెక్టుకు పర్యవేక్షకుడిగా నియమితుడు కావడం విశేషం. ఇంకా పక్కాగా చెప్పాలంటే అజిత్ ను హెలికాఫ్టర్ టెస్ట్ పైలట్ అండ్ యూఏబీ సిస్టమ్ అడ్వైజర్ గా నియమించింది ఐంఐటీ.

అజిత్ తరచుగా చెన్నై ఫ్లైయింగ్ క్లబ్ కు వెళ్లి విమానాలు నడుపుతుంటాడు. ఇండియాలో పైలట్ లైసెన్స్ ఉన్న అతి కొద్ది మంది నటుల్లో అజిత్ ఒకడు. డ్రోన్స్ లాంటి రిమోట్ కంట్రోల్ వెహికల్స్ ను ఆపరేట్ చేసే సామర్థ్యం కూడా అతడికి ఉంది. ‘వివేగం’ సినిమాలో ఈ తరహా సీన్లో అజిత్ రియల్ గానే డ్రోన్ ను ఆపరేట్ చేశాడు. ఈ ఏడాది ఎంఐటీ విద్యార్థులు ఒక అడ్వాన్స్డ్ డ్రోన్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు అజిత్ పర్యవేక్షకుడు.. సలహాదారుగా నియమితుడు కావడం విశేషం. ఇందుకోసం అజిత్ కు గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నారు. ఆ మొత్తాన్ని అతను తిరిగి విద్యార్థులకు ఇచ్చేయబోతున్నాడు. ఒక స్టార్ హీరో ఇలాంటి బాధ్యత తీసుకుని విద్యార్థులు చేపట్టే డ్రోన్ ప్రాజెక్టును పర్యవేక్షించడం అన్నది అరుదైన విషయం. దీని గురించి అజిత్ అభిమానులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News