నాగ్ న్యూ లుక్.. అదిరింది బాసు!
చివరిగా ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన నాగార్జున ఇప్పటికీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు నాగార్జున. ప్రస్తుతం రచయితగా వ్యవహరిస్తున్న ప్రసన్నకుమార్ బెజవాడ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తారని ప్రచారం జరిగింది.
సినిమా చూపిస్త మామ, నేను లోకల్, ధమాకా, ఇటీవల విడుదలైన ధమ్కీ సినిమాలకు కూడా రైటర్ గా వ్యవహరించిన ప్రసన్నకుమార్ చెప్పిన కథకు ఫిదా అయ్యాడని ఆయనతో కలిసి సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు కానీ దాదాపుగా వారి కాంబినేషన్లో ప్రాజెక్ట్ సెట్ అయినట్లే వార్తలు బయటకు వస్తున్నాయి.
అయితే ఆ సంగతి అలా ఉంచితే నాగార్జున తాజా లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఘోస్ట్ సినిమా కోసం పూర్తిస్థాయిలో ఒక రక్షణ అధికారిగా కనిపించిన నాగార్జున పూర్తిస్థాయి షేవింగ్ లుక్ తో కనిపించారు. కానీ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లుక్కులో మాత్రం పూర్తిస్థాయిలో గడ్డాలు మీసాలు పెంచుకొని కనిపిస్తున్నారు.
అయితే ఇది ప్రసన్నకుమార్ బెజవాడతో చేయబోతున్న సినిమా కోసమా లేక ఎలాగో సినిమాల్లో బిజీగా లేను కదా అని ఇలా గడ్డం పెంచారా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఒకరకంగా నాగార్జున ఈ లుక్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నట్లుగా చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ ప్రసన్నకుమార్ బెజవాడతో సినిమా ఒక మలయాళ సినిమాకి రీమేక్ అని ఒక ప్రచారం జరుగుతుండగా లేదు నాగార్జున గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని మరో ప్రచారం జరుగుతోంది.
అయితే ఆ విషయం మీద కూడా అధికారిక ప్రకటన లేదు . ఇక డైరెక్టర్ ప్రసన్నకుమార్ బెజవాడతో చేయబోయే సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ వానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగులో యూటర్న్ సినిమాతో నిర్మాతగా హిట్ అందుకున్న శ్రీనివాస చిట్టూరి తర్వాత రామ్ తో ది వారియర్ సినిమా నిర్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.