ఆ సినిమాకు నాని ప్యాంట్ తడిసిందిట

Update: 2022-06-05 09:25 GMT
నేచురల్ స్టార్ నాని మొదట సినిమా ఇండస్ట్రీలోకి దర్శకుడు కావాలి అని అడుగు పెట్టిన విషయం తెలిసిందే. లెజండరీ డైరెక్టర్ బాపు దగ్గర కొన్ని సినిమాలకు సహాయక దర్శకుడిగా కూడా పనిచేశాడు. అయితే అనుకోకుండా అతనికి హీరోగా అవకాశం రావడంతో అదృష్టవశాత్తు అలానే స్థిరపడి పోయాడు. కానీ భవిష్యత్తులో మాత్రం తప్పకుండా డైరెక్షన్ చేస్తాను అని అన్నాడు. ఇక మొత్తానికి నాని వరుస పరాజయాల అనంతరం శ్యామ్ సింగ్ సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

అంతకు ముందు వచ్చిన వి సినిమాతో పాటు టక్ జగదీష్ రెండు కూడా ఓటి టిలో విడుదలై తీవ్రస్థాయిలో నెగటివ్ కామెంట్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక శ్యాంసంగ్ రేయ్ సినిమాతో కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న నాని ఇప్పుడు పూర్తిగా కామెడీ జానర్లో తెరకెక్కిన 'అంటే.. సుందరానికి' సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నాడు. ఇక జూన్ 10వ తేదీన 'అంటే సుందరానికి' విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని తన జీవితంలో ఒక సినిమా చూసి ప్యాంట్ తడిపేసుకున్నట్లు వివరణ ఇవ్వడం విశేషం. అదికూడా రాంగోపాల్ వర్మ చిత్రం అని తెలియజేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన దెయ్యం సినిమా కు నాని తన స్నేహితులతో కలిసి వెళ్ళాడట.

అయితే సినిమా చూస్తున్నంతసేపు చెమటలు పట్టేసాయట. ఒక సన్నివేశంలో హటాత్తుగా భయపడి తన చేతి లో ఉన్న కూల్ డ్రింక్ ను ప్యాంటు మీద పారేసుకున్నాడట. దీంతో ప్యాంట్ మొత్తం తడిచిపోయిందట. అయితే పక్కనే ఉన్న స్నేహితులు అది చూసి సినిమాకు భయంతో ప్యాంట్ తడిపేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తూ నవ్వుకున్నారు అని నాని వివరణ ఇచ్చాడు. ఇక నాని అంటే సుందరనికి సినిమా అనంతరం దసర సినిమాను విడుదల చేయనున్నాడు. ఆ సినిమా సౌత్ ఇండస్ట్రీలో భారీగా విడుదల కానుంది.
Tags:    

Similar News