సుమ.. ఈ పేరును ప్రత్యేకంగా సినిమా ప్రియులకు.. బుల్లి తెర వర్గాల వారికి మరియు మరెవ్వరికైనా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లితెర.. వెండి తెరను సమన్వయ పర్చుతూ సుదీర్ఘ కాలంగా కెరీర్ లో దూసుకు పోతున్న యాంకర్ సుమ.. హోస్ట్ సుమ మరో సారి నటిగా కెరీర్ లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా జయమ్మ పంచాయితీ అనే సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్ కోసం టాలీవుడ్ కదలి వచ్చింది.
టైటిల్ ను రివీల్ చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే.. ట్రైలర్ ఆవిష్కరించింది పవన్ కళ్యాణ్. ఇలా ఎంతో మంది స్టార్స్ జయమ్మ పంచాయితీ సినిమా కోసం కాదనకుండా ముందుకు వచ్చి ప్రమోషన్ లో భాగస్వామ్యం అయ్యారు. ఇక విడుదల దగ్గర పడుతున్న సమయంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మరియు నాని పాల్గొన్నారు. వీరిద్దరు స్టార్స్ కూడా సుమ పై తమకు ఉన్న అభిమానంను మాటల రూపొంలో చెప్పుకొచ్చారు.
నాగార్జున మాట్లాడుతూ... సుమ ఈ కార్యక్రమానికి పిలిచిన సమయంలో కాదనలేక పోయాను. ఎందుకంటే ఆమెను ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. సుమ కు ఉన్న ప్రతిభలో ఇమేజ్ లో కనీసం 10 శాతం చిత్ర యూనిట్ సభ్యులు వాడుకుని ఉంటే తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందని నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
నాని మాట్లాడుతూ.. సుమ గారు అంటూ పైకి పిలిచినా కూడా నా మనసులో మాత్రం ఆమెకు సుమక్క అనే స్థానం ఉంటుంది. నేను ఎప్పుడు ఆమెను సుమక్క గానే చూస్తాను. ఆమె సినిమా పరిశ్రమకు చాలా చేసింది. సినిమా కోసం వర్క్ చేసిన వారి కంటే.. ప్రభుత్వం కంటే ఆమె సినిమా కు అందిస్తున్న సేవ ఎక్కువ అంటూ రెండు ముక్కల్లో సుమ స్థాయిని నాని అమాంతం పెంచాడు. నాని వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరు ఏకీభవిస్తారు అనడంలో సందేహం లేదు.
సినిమా కు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంతో పాటు.. మాకు ఎనర్జిని ఇస్తుంటారు. ఆమెకు ప్రత్యేకంగా విషెస్ చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను నాని వ్యక్తం చేశాడు. జయమ్మ పంచాయితీ సినిమాలో సుమ పాత్ర ఇప్పటికే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది.
గయ్యాలి గా కనిపించే ఒక పల్లెటూరు ముదురు వయసు మహిళ జయమ్మ గా సుమ కనిపించబోతుంది. ఈనెల 6వ తారీకున ప్రేక్షకుల ముందుకు ఒక స్టార్ హీరో సినిమా రేంజ్ లో రాబోతుంది. సుమకు ఉన్న స్టార్ డమ్.. ఆమెకు స్టార్స్ తో ఉన్న సన్నిహిత్యం కారణంగా జయమ్మకు విపరీతమైన క్రేజ్ దక్కింది. కనుక ఖచ్చితంగా సుమ జయమ్మ గా ఆకట్టుకుంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.