గుణశేఖర్ అంటే మెగా డైరెక్టర్ గా పాపులర్. కెరీర్ లో చూడాలనుంది .. మృగరాజు.. వరుడు.. రుద్రమదేవి లాంటి మెగా సినిమాలు తీశారాయన. గుణశేఖర్ ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఆదుకున్న సంగతి తెలిసిందే. రుద్రమదేవి రిలీజ్ ఆగిపోయే సన్నివేశంలో ఉన్నప్పుడు ఆ సినిమాకి ట్రేడ్ పరమైన ఇబ్బంది కలగకుండా సాయమందించాడు బన్ని. ఆ తర్వాత మూవీ రిజల్ట్ గురించి తెలిసిందే.
అదంతా అటుంచితే రుద్రమదేవి చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించిన హీరో సుమన్ ని గుణశేకర్ మోసం చేశారా? అంటే అవుననే సుమన్ ఆరోపించడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో అనుష్క కాంబినేషన్ లో అద్భుతమైన సీన్స్ ఉంటాయని .. ప్రతినాయకుడిగా అనుష్కతో నువ్వా నేనా? అంటూ పోటీపడే పాత్ర ఇదని సుమన్ కి ఆయన మాటిచ్చారట. కానీ తీరా సినిమాలో చూస్తే సుమన్ పాత్రకు ప్రాధాన్యత లేకుండా పోయింది.
రుద్రమ (అనుష్క) తో క్లైమాక్స్ లో భీకరమైన పోరాటం ఉంటుందని గుణశేఖర్ తనని మభ్య పెట్టారని సుమన్ ఆరోపించారు. అంతేకాదు తనకు ఇచ్చే పారితోషికం సరిగా ఇవ్వలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అరోపించారు. అయితే రుద్రమదేవి చిత్రం కోసం తలకుమించిన ఫైనాన్సులు తెచ్చిన గుణశేఖర్ పూర్తిగా ఇబ్బంది పడే సన్నివేశంలోనే ఆయనకు పారితోషికం ఇవ్వలేదా? అలాగే సినిమా రిలీజ్ ముంగిట ఎంతో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. అసలు క్లైమాక్స్ కోసం పెట్టాల్సిన పెట్టుబడి కూడా పెట్టకుండా యానిమేషన్ బొమ్మలతో ఆ సినిమాలో కొన్ని సీన్లను లాగించేయడం అప్పట్లో చర్చకు వచ్చింది. అయితే ఆ పరిస్థితి గురించి సుమన్ ప్రస్థావించకుండా నేరుగా తనకు జరిగిన అన్యాయం గురించే మాట్లాడారన్న ముచ్చటా ఫిలింనగర్ లో సాగుతోంది. మరోవైపు రానా కథానాయకుడిగా హిరణ్యకసిప లాంటి విజువల్ ఫీస్ట్ కి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినా ఆ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ అప్ డేట్ లేనేలేదు. ప్రీవిజువల్ వర్క్ సాగుతోంది అని చెబుతున్నా.. గుణశేఖర్ ఆఫీస్ నుంచి అధికారిక ప్రకటన అన్నదే లేకపోవడంతో ఈ మెగా డైరెక్టర్ ప్రస్తుతం ఏం చేస్తున్నారోనన్న సందిగ్ధత అభిమానుల్లో నెలకొంది.