పిల్ల చూపు పెళ్లి గాలి వైపు! కార‌ణాలు అవేనా?

Update: 2022-08-09 07:30 GMT
టాలీవుడ్ ప్రేక్ష‌కులు ఆ బ్యూటీ న‌ట‌న‌కి ఫిదా అయిపోతారు. తొలి సినిమాతోనే అమ్మ‌డు ప్రేక్ష‌కుల్ని  అంత‌గా ఫిదా చేసింది. అటు ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ గా అవ‌త‌రించింది. యాక్టింగ్  స్కిల్స్ మాత్ర‌మే కాదు...అమ్మ‌డు మంచి డాన్స‌ర్ కూడా. ఆ డాన్సుకి  ఇండ‌స్ర్టీనే ఫిదా అవుతుంది. ఆమె  అంత గొప్ప డాన్స‌ర్.  శ‌రీరాన్ని సునాయాసంగా విల్లులా వంచేస్తుంది.

తెలుగు భాష సైతం ఎంతో చ‌క్క‌గా మాట్లాడుతుంది. ఆ భాష చూసి  తెలుగు పిల్లే అనుకుంటారు. అంతగా భాష ఉచ్చ‌ర‌ణ క‌నిపిస్తుంది. ఇక పాత్ర ప‌రంగా ఎలాంటి పాత్ర ప‌డితే అలాంటి రోల్ చేయ‌దు. త‌న‌కంటూ కొన్ని నిబంధ‌ల‌నులున్నాయి. వాటిని  దాటి ఏ సినిమా చేయ‌దు. ఎన్ని కోట్లు ఇస్తామ‌న్నా?  కొన్ని ప‌నుల‌కు ఆమె ఆమ‌డ దూరంలో ఉంటుంది.

ఆ ర‌కంగా టాలీవుడ్ లో త‌న క్రేజ్ ని రెట్టింపు చేసుకుంది. ఇక  కుటుంబానికి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తుంది. త‌ల్లిదండ్రుల్ని ఎంత‌గానో గౌర‌విస్తుంది. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడల్లా అమ్మానాన్న‌ని  తెగ పొగిడేస్తుంది కూడా. ఇంట్లో చిన్న నాటి నుంచి ఎంతో గారాబంగా పెరిగిన బిడ్డ‌నంటుంది. ఇక కెరీర్ ఆరంభంలో  అయితే  అమ్మానాన్న‌లు కోసం ఏకంగా పెళ్లి కూడా చేసుకోను అంది.

పెళ్లి చేసుకుని వెళ్లిపోతే  వాళ్ల‌ని ఎవ‌రు చూసుకుంటారు?  పెంచి పెద్ద‌చేసిన వారిని వ‌దిలేసి ఎలా వెళ్లిపోతాం? అని చెప్పుకొచ్చింది.   ప్రేమ గీమా జాన్తాన‌య్ అనేది.  మ‌రి ఇప్పుడు ఆ బ్యూటీ ఆలోచ‌న తీరులో మార్పులొస్తున్నాయా?  పెళ్లి విష‌యంలో  నిర్ణ‌యాలు మారాయా? అంటే అవున‌నే తెలుస్తోంది.

ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో  ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు? అంటే  మంచి కుర్రాడ్ని చూసి మూడేళ్ల‌లో పెళ్లి  చేసుకోవాల‌నుకుంటోన్న విష‌యాన్ని రివీల్ చేసింది.  అలాగే ప్రేమ విష‌యంలో  మార్పులొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ఒక‌ప్పుడు ప్రేమ అనే ప‌దానికి దూరంగా ఉండే అమ్మ‌డు ఇప్పుడు ప్రేమ‌గురించి ఎంతో గొప్ప‌గా చెబుతుంది.

మ‌రి ఈ మార్పు నిజంగా ప్రేమ‌లో ప‌డా?  లేక  ప్రేమ నేప‌థ్యం గ‌ల సినిమాలు చేసా? అన్న‌ది తెలియ‌దుగానీ అమ్మ‌డి లో మార్పుకు మాత్రం అంతా సంతోషిస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ యువ హీరోతో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు ప్ర‌చారం సాగింది. అలాగే ప్రేమ‌ నేప‌థ్యం ఉన్న సినిమాలు చేయ‌డంతో ద్వారా క‌ఠిన‌మైన మ‌న‌సు క‌రిగిన సంద‌ర్భాలెన్నో ఉన్నాయి.

షూటింగ్ మ‌ధ్య‌లో ప్రేమ‌లో ప‌డిన జంటలెన్నో ఉన్నాయి.   ఇలా ఏదో ఒక సంఘ‌ట‌న ఆ హీరోయిన్ లోనూ  మార్పు తీసుకొచ్చి ఉండొచ్చు. ప్ర‌స్తుతం ఈ భామ ప‌లు తెలుగు సినిమాల‌తో బిజీగా ఉంది. కొన్ని బ‌డా ఆఫ‌ర్ల‌ని సైతం రిజెక్ట్ చేసింది.
Tags:    

Similar News