నాగచైతన్య.. సమంత జంటగా నటించిన 'మజిలీ' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంలో నాగచైతన్య మాజీ ప్రియురాలి కూతురుగా నటించిన పాప మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ పాప పేరు అనన్య అగర్వాల్. 9 ఏళ్ల వయసు నుండే సీరియల్స్.. యాడ్స్ లో నటిస్తున్న అనన్యకు ఉత్తరాదిన స్టార్ గుర్తింపు ఉంది. తెలుగులో ఈమెకు మజిలీ చిత్రంతో మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ పాప వయసు 16 ఏళ్లు. అప్పుడే అనన్య హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. అది కూడా తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఉత్తరాది అమ్మాయిలు ప్రస్తుతం టాలీవుడ్.. కోలీవుడ్ లో స్టార్స్ గా ఉన్న వారు చాలా మంది 15.. 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. కాని ఈ మద్య కాలంలో 20 దాటిన తర్వాతే హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. కాని బెల్లంకొండ గణేష్ సినిమా కోసం పాత్ర రీత్యా కాస్త చిన్న అమ్మాయి హీరోయిన్ గా కావాల్సి ఉందట. అందుకే 16 ఏళ్లే అయినా కూడా అనన్యను బెల్లంకొండ గణేష్ కోసం ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
'బ్రోచేవారెవరు' చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న డాక్టర్ వివేక్ ఆచార్య తన తదుపరి చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు నోటెడ్ అయ్యాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు గణేష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మొదటి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే పట్టుదలతో గణేష్ ఉన్నాడు. తనయుడిని మొదటి సినిమాతోనే స్టార్ డం తేవాలని సురేష్ కూడా భావిస్తున్నాడట. అందుకే ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు.
అందులో భాగంగానే హీరోయిన్ గా అనన్య అగర్వాల్ ను ఎంపిక చేయడం జరిగిందట. 16 ఏళ్ల వయసే అయినా కూడా చూడ్డానికి కాస్త ఎక్కువ వయసు అమ్మాయి మాదిరిగానే కనిపిస్తుంది. అందుకే గణేష్ కు జోడీగా తీసుకుని ఉంటారు. సినిమా వచ్చిన తర్వాత దర్శకుడి నిర్ణయం ఎంత వరకు కరెక్ట్ అనే విషయం అర్థం అవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రంను విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నట్లుగా ఇటీవలే ప్రారంభోత్సవం సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.