ఫిదా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారక్టర్ చేసిన గాయత్రి గుప్తా అనే అమ్మాయి కూడా.. క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్ గానే మాట్లాడింది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ర్టీలో ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అంటూ చాలామంది ఆలోచిస్తున్నారేమో కాని.. ఉందీ అంటోంది ఈ అమ్మయి. చిన్న సినిమాల్లో చేసిన తను కాస్త ఘాటుగానే నిజాన్ని చెప్పింది.
''ఒక సంవత్సరం క్రితం నేను ఒక సినిమాను చేశాను. ఆ సినిమా చేసేముందు పడుకోమంటే పడుకోను.. నాకలాంటివి నచ్చవు అని చెప్పాను. వారు ముందు ఓకె అన్నారు. కాని షూటింగ్ మొదలయ్యాక.. నిధానంగా బలవంతం చేయడం మొదలుపెట్టారు. నీకు ఒక్క రాత్రికి చాలా డబ్బులు ఇస్తామని చాలామంది ఆఫర్ చేస్తున్నారు.. ఒప్పుకో అన్నారు. నాకు ఇష్టం లేదు అని చెప్పాను. కాని ఒకరోజు కారులో తీసుకెళుతూ కారును బ్రేక్ డౌన్ చేసి.. ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అని చెప్పి.. అక్కడకు తీసుకెళ్ళి డ్రస్సు లాగేస్తూ రేప్ చేయబోయాడు. చివరకు తప్పించుకుని వచ్చేశా'' అంటూ వివరించింది గాయత్రి గుప్తా.
అయితే ఇటువంటి వారిని చూసి విసుగొచ్చేసి.. ఇప్పుడు అసలు సినిమాల్లో నటించాలనే అనిపించట్లేదని చెప్పింది ఈ నటీమణి. ''నేనే పాటలు రాయగలను.. నేనే పాడగలను.. నేనే డైరక్ట్ చేయగలను.. కాబట్టి ఇప్పుడు నా సినిమాలను నేనే ప్రొడ్యూస్ చేసుకుని డైరక్ట్ చేసుకుంటా'' అని చెప్పింది గాయత్రి గుప్తా. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్లో ఉందట. మరి టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పై ఈమె ఈ రేంజులో ఓపెన్ గానే చెప్పింది కదా.. మన పెద్దలు ఏమంటారో చూద్దాం.