ఫోటో స్టొరీ: అర్మానిలో స్టన్నింగ్ లేడీ

Update: 2019-05-07 14:30 GMT
కత్రినా కైఫ్ అనగానే మనం బాలీవుడ్ హీరోయిన్ అని ఫిక్స్ అయిపోతాం కానీ కత్రినా తన కెరీర్ ప్రారంభంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోలు వెంకటేష్.. బాలకృష్ణ సినిమాల్లో నటించింది.  వెంకటేష్ తో 'మల్లీశ్వరి'.. నందమూరి బాలకృష్ణ తో 'అల్లరిపిడుగు' లో నటించి అప్పటి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ అప్పట్లో జస్ట్ గ్లామర్ తోనే నెట్టుకురావాల్సి వచ్చేవి ఎందుకంటే మొహంలో ఎక్స్ ప్రెషన్స్ అసలు పలికేవి కాదు! సరే అదంతా ఫ్లాష్ బ్యాక్.

ప్రెజెంట్ కు వస్తే  కత్రినా ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.   కత్రినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్స్టాగ్రామ్ లో 21.5 మిలియన్స్ ఫాలోయర్లు ఉన్నారు.  రెగ్యులర్ గా  అప్డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేయడం కత్రినాకు ఒక ఫేవరెట్ హాబీ.  తాజాగా కత్రినా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ప్రముఖ మాగజైన్ ఎలి(Elle -ఎల్ అని కూడా అంటారు) మే ఎడిషన్ కవర్ పేజిపై తళుక్కున మెరిసింది.  ఈ మ్యాగజైన్ లో 'కత్రీనా కైఫ్ అన్ ప్లగ్ద్' అనే ఒక కథనం కూడా ప్రచురించారు.

ఈ ఫోటో షూట్ జరిగింది మాల్దీవ్స్ లో.  కత్రినా ధరించినవి.. మార్ని- అర్మాని బ్రాండ్  దుస్తులు.  స్కై బ్లూ కలర్ షర్టు ప్యాంట్.  షర్టు బటన్స్ వేసుకోకుండా అలానే వదిలేయడంతో  సిల్వర్ కలర్ లో ఉన్న ఇన్నర్ వేర్ దర్శనం.. అందాల ప్రదర్శనం పూర్తయింది.  బీచ్ ఇసుకలో వేసిన నాలుగు కాళ్ళ మడత కుర్చీ లో ఒక లేడీ డాన్ లాగా కూర్చుంది.  జుట్టును లూజ్ గా వదిలేయడంతో ఒక ఇంటెన్స్ లుక్ వచ్చింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన జస్ట్ గంటలోనే రెండున్నర లక్షల లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్స్ లో స్టన్నింగ్ లేడీ అని.. కిల్లింగ్ బ్యూటీ అని.. గార్జియస్ అని ఎవరికి తోచినట్టు వారు పొగడ్తల వర్షం కురిపించారు.

కత్రినా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ తో నటించిన 'భారత్' జూన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  ఈ సినిమా కాకుండా అక్షయ్ కుమార్ తో 'సుర్యవంశీ' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.
Tags:    

Similar News