ఆమద్య కాస్టింగ్ కౌచ్ గురించి తెగ ప్రచారం జరిగింది. అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే అమ్మాయిలను లోబర్చుకోవడం, వారిని వాడుకోవడం, ఛాన్స్ లు ఇప్పిస్తామంటూ మోసం చేయడం ఇండస్ట్రీలో చాలా కామన్ అంటూ చాలా మంది చేసిన ఆరోపణల ద్వారా వెళ్లడయ్యింది. తాజాగా ఈ విషయమై తెలుగు నిన్నటి తరం హీరోయిన్, తెలుగమ్మాయి లయ చాలా పాజిటివ్ గా స్పందించింది. కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఉంది. కాని సినిమా పరిశ్రమనే ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మిగిలిన రంగాల్లోని కాస్టింగ్ కౌచ్ గురించి మీడియా వారు ఎందుకు పట్టించుకోరు అంటూ ప్రశ్నించింది.
మీడియా వారికి గ్లామర్ తారలే కావాలి. వారి గురించి ఇష్టం వచ్చినట్లుగా కథనాలు రాసి, వీడియోలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆమద్య నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలో నా తెలుగు బాగా లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు. చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉండటం వల్ల తెలుగు మాట్లాడటంలో కాస్త తేడా వచ్చి ఉండవచ్చు. ఎంత మంది తెలుగు బాగా మాట్లాడతారు. అమ్మాయిలనే ఎందుకు మీడియా వారు టార్గెట్ చేస్తూ ఉంటారు.
ఎంతో మంది హీరోలు కూడా తెలుగును సరిగా మాట్లాడలేరు. మరి వారి గురించి ఏమైనా రాయగలరా అంటూ లయ ప్రశ్నించింది. సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేయాలంటే భయంగా ఉంది. ఆ ఫొటోలతో ఏం వీడియోలు చేస్తారో, ఎలాంటి కామెంట్స్ చేస్తారో అనే భయంతో నా ఫ్యామిలీ ఫొటోలను అసలు బయటకు రానివ్వడం లేదు అంటూ లయ చెప్పుకొచ్చింది.