తెలుగు తో పాటు పలు భాషల్లో సుదీర్ఘ కాలంగా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న మీనా గత కొన్నాళ్లుగా కెమెరా కు దూరంగా ఉంది. భర్త విద్యాసాగర్ మృతి తో తీవ్ర విషాదంలో ఉన్న మీనా మెల్ల మెల్లగా కోలుకుంటూ కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు అంటూ సమాచారం అందుతోంది.
హీరోయిన్ గా అప్పట్లో ఎన్నో వందల సినిమాలు చేసిన మీనా ఇప్పుడు న్యూ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. అమ్మగా.. అత్తగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. విద్యా సాగర్ మృతి సమయంలోనే మీనా కొన్ని సినిమాలను కమిట్ అయ్యి ఉన్నారు. ఆ సినిమాలు కొన్ని క్యాన్సిల్ అవ్వగా కొన్ని ఇంకా మీనా కోసం వెయిట్ చేస్తున్నాయి.
ఆ సినిమాల షూటింగ్స్ లో మీనా మళ్లీ పాల్గొనబోతుంది. దృశ్యం 3 సినిమా తో ఆమె సినీ జర్నీ మళ్లీ మొదలు అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో మీనా పాల్గొంటున్నారు. ఆ వెంటనే సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
భర్త విద్యాసాగర్ మృతి బాధ నుండి తేరుకునేందుకు ఇటీవలే ఈమె విదేశీ పర్యటన వెళ్లారు. అక్కడ ఈమె కొన్ని వారాల పాటు సన్నిహితుల వద్ద ఉన్నారు. తిరిగి ఇండియాకు వచ్చిన మీనా మెల్ల మెల్లగా సినిమాలతో బిజీ అవ్వాలని భావిస్తున్నారు. సినిమాలతో బిజీ అయితే ఆ విషాదం నుండి మరింతగా బయట పడే అవకాశం ఉందని మీనా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.