బాల నటిగా మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ నివేదా థామస్ నాని 'జెంటిల్ మన్' మరియు 'నిన్ను కోరి' చిత్రాలతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ వెంటనే ఎన్టీఆర్ 'జైలవకుశ' చిత్రంలో నటించింది. కొన్ని కారణాల వల్ల జై లవకుశ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నివేదా థామస్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన '118' చిత్రంలో నటించి ఆకట్టుకుంది. ఆ చిత్రంలో ఈమెది చిన్న పాత్రే అయినా కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు తమిళం కలిపి అరడజను వరకు సినిమాలు చేస్తున్న నివేదా థామస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం తాను తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. వరుసగా ఆఫర్లు వస్తున్నా కూడా కథను, పాత్రను చూసి సినిమాల ఎంపిక చేస్తున్నాను. ఇక తనకు టాలీవుడ్, కోలీవుడ్ లో ఏ హీరోయిన్ పోటీ కాదని, తనకు హీరోలే పోటీ అంటూ చెప్పుకొచ్చింది. హీరోలతో పోటీ పడి నటించాలని తాను ఎప్పుడు భావిస్తాను. హీరోయిన్ లతో పోటీ పడాలని తనకు ఉండదని, హీరోలకు ధీటైన పాత్రలు చేయాలని తాను ఆశపడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా హీరో స్థాయి హీరోయిన్ అంటూ తనను గుర్తించాలి, హీరోలతో నన్ను పోల్చే స్థాయికి వెళ్లాలి అని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. చేసింది కొన్ని సినిమాలే అయినా ఈమె చాలా కలలు కంటోంది. మరి ఈ కల అంత సులభంగా వర్కౌట్ అయ్యేదేనా చెప్మా..!