రోజూ కొత్త‌గా చేయ‌క‌పోతే కిక్కు లేద‌ప్పా.. కొత్త వీడియో షేర్ చేసిన న‌టి ప్ర‌గ‌తి!

Update: 2021-03-11 14:14 GMT
'జీవితంలో ప్ర‌తిరోజూ ఏదైనా కొత్త‌గా చేయాలి. లేదంటే.. ఆ రోజును మ‌నం కోల్పోయిన‌ట్టే'' ఇదీ.. సీనియర్ నటి ప్రగతి ఫిలాసఫీ. చెప్పడమే కాదు.. అందుకు తగ్గట్టుగానే చేస్తుంది ఈ నటీమణి. అప్పటి వరకూ పెద్దగా ఫోకస్ చేయని సోషల్ మీడియా మొత్తం.. ఈ మ‌ధ్య‌ ఆమె అకౌంట్ పై ఫుల్లుగా దృష్టి పెట్టింది.

దీని కార‌ణం.. లాక్ డౌన్ స‌మ‌యంలో ప్ర‌గ‌తి పోస్ట్ చేసిన వీడియోలు, ఫొటోలే! నాలుగు గోడ‌ల‌కే ప‌రిమిత‌మైన స‌మ‌యంలో.. స్పెష‌ల్ డ్యాన్సులతో ఈ న‌టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే.. లాక్ డౌన్ ముగిసిన త‌ర్వాత కూడా త‌న హ‌వా కంటిన్యూ చేస్తోంది.

తాజాగా.. బుల్లెట్ న‌డిపిన ప్ర‌గ‌తి వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పెద్ద మ‌హిళ త‌ర‌హాలోనే చీర‌క‌ట్టులో బుల్లెట్ ఎక్కిన ప్ర‌గ‌తి ర‌య్య్ మంటూ దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను త‌న అకౌంట్లో పోస్ట్ చేసింది ప్ర‌గ‌తి. ఈ వీడియోకు లైకుల వ‌ర్షం కురుస్తోంది. ఎవ‌రు ఏమ‌న‌కుంటారో అనే విష‌యాన్ని లైట్ తీసుకునే ఈ న‌టీమ‌ణి.. దీనికి ఓ క్యాప్ష‌న్ కూడా రాసింది. ''ఫ‌లితం మీద న‌మ్మ‌కం ఉంచి ప్ర‌య‌త్నాలు చేయాలి'' అని రాసుకొచ్చింది.


Tags:    

Similar News