పిక్ టాక్ : బ్లాక్ లో వైట్ గా మెరిసి పోతున్న కంచె బ్యూటీ

Update: 2023-01-13 00:30 GMT
మెగా హీరో వరుణ్‌ తేజ్ కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. మొదటి సినిమాతోనే తన అందంతో పాటు నటనతో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్‌ కి అదృష్టం కలిసి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో సినిమాల్లో ఆఫర్లు రాలేదు.

స్టార్‌ హీరోల సినిమాల్లో ఆఫర్లు రాకున్నా.. చేసిన సినిమాలతో కమర్షియల్ గా భారీ విజయాలను సొంతం చేసుకోలేక పోయినా కూడా ప్రగ్యా జైస్వాల్‌ తన అందాల ఆరబోత కారణంగా రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందంతో మెప్పించింది.

ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రగ్యా ఇలా థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేసింది. బ్లాక్ లో వైట్‌ గా మెరిసి పోతున్న ముద్దుగుమ్మ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యి తెగ లైక్స్ మరియు షేర్స్ తో ముంచెత్తుతున్నారు.

అఖండ సినిమా తో విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌ గా బిజీ అవుతుందని భావించినప్పటికి ఎప్పటిలాగే అవకాశాల కోసం ఈ అమ్మడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్‌ బిజీ అవ్వాలని ఇలాంటి ఫొటోలు చూసినప్పుడు అభిమానులు కోరుకుంటూ ఉంటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News