చెన్నై చిన్నది ప్రియాంకా అరుల్ మోహన్ లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఫిక్స్ చేసుకుంది. తమిళంలో సూర్య, శివ కార్తికేయన్ లాంటి హీరోలతో నటించిన ప్రియాంక తెలుగులో నాని, శర్వానంద్ లాంటి యువ హీరోలతో జత కట్టింది. నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం రెండు సినిమాలు నిరాశపరచడంతో అమ్మడు తెలుగు సినిమాల మీద ఫోకస్ చేయలేదు. మధ్యలో ఒకటి రెండు సినిమా ఆఫర్లు వచ్చినా కాదనేసిందట. అలా ఎందుకు అంటే టాలీవుడ్ లో చేస్తే స్టార్ సినిమాలే చేయాలని అన్నదట.
ఫైనల్ గా అమ్మడు అనుకున్నట్టుగానే ఏకంగా పవన్ కళ్యాణ్ ఛాన్స్ వచ్చింది. సుజిత్ డైరెక్షన్ లో భారీ ప్రాజెక్ట్ గా వస్తున్న ఓజీ సినిమాలో ప్రియాంకా లక్కీ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడి ఫేట్ మారే అవకాశం ఉంది. నాని గ్యాంగ్ లీడర్ టైం లోనే తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ప్రియాంక సరైన అవకాశం ఇస్తే అమ్మడిలో మ్యాటర్ ఉన్నట్టు అనిపించింది. ఇక శివ కార్తికేయన్ తో ఆమె చేసిన రెండు సినిమాలు కూడా మన దగ్గర మంచి ఫలితాలు వచ్చాయి.
సో ఈ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ప్రియాంక మోహన్ పవన్ సినిమాతో అదరగొట్టబోతుంది. ఈ సినిమా విషయంలో సుజీత్ ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో పవన్ లుక్స్ క్రేజీగా ఉండబోతున్నాయని టాక్. అంతేకాదు యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని చెబుతున్నారు. సాహో తర్వాత గ్యాప్ తీసుకున్న సుజిత్ ఫైనల్ గా పవర్ స్టార్ తో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో ఈసారి పవర్ స్టార్ స్టామినా ఏంటో నేషనల్ వైడ్ గా చూపించబోతున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ హరి హర వీరమల్లు, వినోదయ సీతం రీమేక్, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ లతో పాటుగా ఓజీ సినిమాను కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు.