బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొంది తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ రాణి ముఖర్జీ. ఈ బ్యూటీ తరువాత యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్యా చోప్రాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ మరల సిల్వర్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ కథలతో జర్నీ స్టార్ట్ చేసింది. ఈ నేపధ్యంలో తాజాగా ఆమె రియల్ లైఫ్ డ్రామాతో తెరకెక్కిన మిస్సెస్ చటర్జీ వెర్సస్ నార్వే అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ లో రాణి ముఖర్జీ పాల్గొంటుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా తన భర్త ఆదిత్యా చోప్రా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. తన భర్త చాలా మంది హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నారని, అలాంటిది నేను బయట నిర్మాతలతో చేస్తే తప్పేంటి అని ప్రశ్నించింది. నాకు మంచి స్క్రిప్ట్ వస్తే ఏ నిర్మాతలతో అయినా సినిమా చేస్తాను.
అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నా భర్త ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఒక వేళ నా యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి మంచి స్క్రిప్ట్ వచ్చిన చేయడానికి నేను సిద్ధమే అని తెలిపింది. అలాగే తన కొత్త సినిమాని భర్త ఆదిత్యా చోప్రా చూసి మెచ్చుకున్నారు అంటూ పేర్కొంది. ఏదైనా సినిమా చూసి నా భర్త చలించిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది.
అయితే నా సినిమా చూసి మాత్రం భావోద్వేగానికి గురయ్యారు. నా యాక్టింగ్ ని మెచ్చుకున్నారు అని రాణి ముఖర్జీ పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ బిటౌన్ లో వైరల్ గా మారాయి. ఆదిత్యా చోప్రా నిర్మాణంలో ఈ ఏడాది పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో యష్ రాజ్ ఫిలిమ్స్ హిందీలో మొదటి వెయ్యి కోట్ల గ్రాస్ ప్రాజెక్ట్ రికార్డ్ ని తన పేరు మీద ఏర్పరుచుకుంది అని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.