సో స్వీట్ అనిపించేలా అశోక‌వ‌నం బ్యూటీ!

Update: 2022-05-20 02:30 GMT
`అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం` లో సెకెండ్ లీడ్ పోషించిన రితికా నాయ‌క్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. తొలి సినిమాతోనే ఇంప్రెసివ్ గాళ్ గా ప్రూవ్ చేసుకుంది. నేచుర‌ల్ పెర్పార్మెన్స్ తో విమర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. మెయిన్ లీడ్  పోషించిన రుక్షర్ ఢిల్హాన్   క‌న్నా రితిక న‌ట‌న‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి.  అందం..అభిన‌యంతో పాటు ట్యాలెంటెడ్ బ్యూటీగా ఎస్టాబ్లిష్ అవుతుంది.

అంతేనా అమ్మ‌డు ఏకంగా టాలీవుడ్ బ‌డా నిర్మాత‌ల్నే లాక్ చేస్తుంది. దిల్ రాజు..అల్లు అర‌వింద్ లాంటి దిగ్గ‌జ నిర్మాత‌ల ప్ర‌శంస‌లు దక్కించుకుంది. జీఏ-2 బ్యాన‌ర్లోనే ఏకంగా మూడు సినిమాల‌కు అప్పుడే సంత‌కాలు సైతం చేసింద‌ని టాక్ వినిపిస్తుంది. అమ్మ‌డి ట్యాలెంట్ గుర్తించే మెగా నిర్మాత ఇలా లాక్ చేసి ఉంటార‌ని తెలుస్తోంది.

అదే నిజ‌మైతే రితికా నాయ‌క్ ఫేట్ మారిన‌ట్లే. న‌క్క తొక తొక్కి వ‌చ్చిన‌ట్లే. ఇంత ట‌ఫ్ కాంపిటీష‌న్ మ‌ధ్య ఒక్క ఛాన్స్ రావ‌డ‌మే క‌ష్టం. అలాంటిది ఏకంగా రెండు.మూడు ఛాన్సులు అప్పుడే క్యూ లో పెట్టిందంటే పిల్ల ట్యాలెంటెడ్ అనాలి. ఇక స‌క్సెస్ ఫుల్ నవ నాయిక‌ల సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పేదేముంది. మేక‌ప్ వేయ‌క ముందే ఇన్ స్టాలో యువ‌త వెంబ‌డిస్తూనే ఉంటుంది.

తాజాగా రితికా కొత్త ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇందులో అమ్మ‌డు సో స్వీట్ అనిపించే లుక్ లో ఆక‌ట్టుకుంటుంది. క్యూట్ స్మైల్ తో క‌ళ్ల‌లో  తెలియ‌ని మెరుపు  తో మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. గ్లామ‌ర్ ఎలివేష‌న్ల‌కి ఇంకా టైమ్ ఉంది. ప్ర‌స్తుతానికి ఉన్న అందంతో ఆస్వాదించ‌డ‌మే యువ‌త ప‌ని.

రితికా నాయక్ ఢిల్లీ నుంచి దిగుమ‌తి అయింది. అక్క‌డే పుట్టి పెరిగింది.  వ‌య‌సు 22. క‌త్రినాకైఫ్ ఇనిస్పేర‌ష‌న్ తో రంగుల ప్ర‌పంచం వైపు అడుగులు వేసింది. బ్యూటీకి మూగ‌జీవాలంటే ప్రాణం. మంచి పెట్ ల‌వ‌ర్.   విరాట్ కొహ్లీని ఆరాదిస్తుంది. పిజ్జా..బిర్యానీ అంటే క‌డుపునిండా ఆర‌గిస్తుంది. వెకేష‌న్ కోసం స్విట్జ‌ర్లాండ్ లెక్కువ‌గా వెళ్తుంది.
Tags:    

Similar News