సంక్రాంతికి 'రాజాసాబ్' ఏమైనా ఉందా?
ఈ సమయంలో రాబోతున్న సంక్రాంతి పండుగ కి రాజాసాబ్ సినిమా నుంచి ఏమైనా అప్‌డేట్ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్, మారుతి కాంబోలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాను ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నాడు. దర్శకుడు మారుతి అందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను చూడటం కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాటలు మినహా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయ్యిందని అంటున్నారు. అయితే ఇటీవల చిన్న యాక్సిడెంట్ కారణంగా ప్రభాస్ షూటింగ్స్‌కి హాజరు కాలేక పోతున్నారు. కనుక ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభం కావడానికి మరింత సమయం పడుతుంది.
ఈ సమయంలో రాబోతున్న సంక్రాంతి పండుగ కి రాజాసాబ్ సినిమా నుంచి ఏమైనా అప్‌డేట్ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దర్శకుడు మారుతి ఒక సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఏం మాట్లాడలేను అన్నాడు. సంక్రాంతికి అప్‌డేట్ వస్తుందా అంటూ ప్రశ్నించిన సమయంలో ఏమీ లేదు, వస్తే మేము తప్పకుండా చెప్తాం అన్నారు. అంటే రాజాసాబ్ సినిమా నుంచి సంక్రాంతి కానుక ఏమీ రావడం లేదు. ఫ్యాన్స్ మాత్రం చిన్న పోస్ట్ విడుదల చేసినా బాగుంటుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మారుతి మాత్రం నిర్మొహమాటంగా సినిమా అప్‌డేట్ ఇప్పుడు లేదు అన్నాడు.
చిన్న సినిమాల దర్శకుడిగా పేరున్న మారుతి ఈ సినిమాతో తన స్థాయిని పెంచుకోబోతున్నాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలపడం కోసం మారుతి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా భారీ యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో కామెడీ హ్రరర్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాల్లో ఇది చాలా విభిన్నమైన సినిమాగా నిలవబోతోంది అంటూ అంతా చాలా ధీమాతో ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ మారుతితో పాటు ఇతర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అతి పెద్ద థ్రిల్లర్ కామెడీ సినిమాగా ఈ సినిమా ఉంటుంది అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. 2025 సమ్మర్ కానుకగా రాబోతున్న రాజాసాబ్ సినిమా తర్వాత ఫౌజీ సినిమాను ఇదే ఏడాదిలో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చాలా ధీమాతో ఉన్నారు.