గ్లామర్ షో అంటే.. చిట్టి పొట్టి దుస్తులను ధరించడమే అని నమ్మేవారు ఎందరో ఉన్నారు. కానీ, గ్లామర్ ను డ్రెస్ తో కనెక్ట్ చేసి చూడటం చాలా తప్పంటోంది సంయుక్త మీనన్. మలయాళంకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. 2016 లో 'పాప్ కార్న్' అనే మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. 'భీమ్లా నాయక్'తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె.చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో రానా భార్య పాత్రను పోషించిన సంయుక్త.. తనదైన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ఇక త్వరలోనే ఈ అమ్మడు 'బింబిసార'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది.
ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తే.. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇందులో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేశాడు.
భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఆగస్టు 5న అట్టహాసంగా విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ఓవైపు వరుస అప్డేట్స్, మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సంయుక్త మీనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది.
నటిని అవుతానని అనుకోలేదని, అనుకోకుండా అవకాశం రావడంతో సినిమాలు చేశానని చెప్పుకొచ్చిన సంయుక్త.. మలయాళంలో తాను చేసిన సినిమాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయని తెలిపింది. అలాగే తెలుగులో తొలి అవకాశం 'బింబిసార'లోనే వచ్చినా.. 'భీమ్లా నాయక్' మొదట విడుదలైందని వివరించింది.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా, ధనుష్ తో 'సార్', మలయాళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నట్లు ఆమె తెలిపింది. అయితే 'ఏ భాషలో సినిమా చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుకుంటున్నాను.
నా వస్త్రధారణ ఎప్పుడు కాస్త నిండుగా ఉంటుంది. నాకు అలానే ఇష్టం. నా దృష్టిలో నేను గ్లామర్ గానే ఉన్నాను. గ్లామర్ ను డ్రెస్ తో కనెక్ట్ చేసి చూడటం తప్పని నా ఫీలింగ్' అంటూ సంయుక్త మీనన్ చెప్పుకొచ్చింది. మొత్తానికి కురచ దుస్తులు ధరిస్తేనే గ్లామర్ గా ఉన్నట్లు కాదని ఆమె కుండబద్దలు కొట్టింది.