భర్తకు ధన్యవాదాలు తెలిపిన బృందావన్ కాలనీ భామ!!

Update: 2020-07-06 04:30 GMT
నటి సోనియా అగర్వాల్.. అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తే ఉంటుంది. ఎందుకంటే '7/జి బృందావన్ కాలనీ' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగులో సోనియా ఫస్ట్ సినిమా అదే. తన మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు రేపింది అమ్మడు. అయితే ఆ సినిమా తర్వాత డైరెక్టర్ సెల్వ రాఘవను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విషయం ఏంటంటే.. సెల్వ రాఘవన్ తెరకెక్కించిన 'కాదల్ కొండేన్' సినిమాతో సోనియా హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. 2003లో విడుదలైన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. అయితే ఆ సినిమా విడుదలై ఇటీవలే 17 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ట్విట్టర్ వేదికగా తన మాజీ భర్త సెల్వ రాఘవ కి ధన్య వాదాలు తెలిపింది. ఆయనే సోనియా ను కథా నాయికగా పరిచయం చేసి సూపర్ హిట్స్ అందించాడు.

ఇక ఆమె ట్విట్టర్ ద్వారా.. "దేవుడికి, తమిళనాడు ప్రేక్షకులకు, సెల్వ రాఘవన్‌కి, కస్తూరి రాజాకు చాలా థ్యాంక్స్‌. హీరోయిన్‌గా నన్ను ప్రేక్షకులకు పరిచయమై 17 సంవత్సరాలు పూర్తి అయ్యింది. అలాగే ధనుష్‌, కాదల్‌ కోండెన్‌ కి పని చేసిన టెక్నీషియన్స్.. ఆర్టిస్ట్స్.. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తమిళ సినీ పరిశ్రమలో ఇది ఓ గుర్తుండిపోయే చిత్రం" అని సోనియా పేర్కొంది. అయితే కాదల్ కోండెన్‌ లో ధనుష్‌ హీరో గా నటించ గా.. ఆ టైం లో నే డైరెక్టర్ సెల్వ రాఘవ తో ప్రేమ లో పడిందట. ఆ తరువాత 2008లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. కానీ వారి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని కారణాల వలన 2010 లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తరువాత సెల్వ గీతాంజలి ని పెళ్లి చేసుకున్నాడు. ఇక సోనియా ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇన్నేళ్ల తర్వాత ఈ భామ మళ్లీ భర్త గురించి ప్రస్తావిచే సరికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Tags:    

Similar News