చెన్నై బ్యూటీ త్రిష తెలుగు సినిమాల నుండి దాదాపు కనుమరుగయినట్టేగానీ తమిళంలో మాత్రం ఇంకా తన సత్తా చాటుతూనే ఉంది. ఈమధ్యే విజయ్ సేతుపతి తో కలిసి నటించిన తమిళ చిత్రం '96' బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయాలని కంకణం కట్టుకుందేమో గానీ ఇప్పుడు కరీబియన్ ఐలాండ్స్ కు వెకేషన్ కోసం వెళ్ళింది.
కోస్టారికా బీచుల్లో ఎంజాయ్ చేస్తూ అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. రీసెంట్ గా అలానే ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి 'కొమస్తాస్' అనే క్యాప్షన్ ఇచ్చింది. స్పానిష్ భాషలో కొమస్తాస్ అంటే 'ఎలా ఉన్నారు' అని అర్థం. ఇక ఫోటోలో ఆమె బికిని లాంటి డ్రెస్ వేసుకుంది. పైనేమో నెటెడ్ టాప్ లాంటి జింగ్ జింగ్ అమేజింగ్ డ్రెస్ వేసుకుంది. ఇక తలలో ఒక చిన్న గొడుగు లాంటిది పెట్టుకుంది. పెద్దగా స్కిన్ షో చేయకుండానే హాట్ లుక్ లో కనిపించింది.
ఇక ఆమె రాబోయే సినిమాల విషయానికి వస్తే రజనీకాంత్ 'పెట్టా' తో పాటుగా 'గర్జనై'.. 'శతురంగ వేట్టై 2'.. 'పరమపదం విలయాడు'.. '1818' అనే తమిళ సినిమాలలో నటిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించడం ఫస్ట్ టైమ్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉంది.