త్రిషను రఫ్పాడించేస్తున్నారుగా!!

Update: 2017-01-18 07:40 GMT
ఒక్క మాటలో చెప్పాలంటే చెన్నై బ్యూటీ త్రిష ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయింది. తమిళనాట బోలెడంత ఇమేజ్ ఉన్న ఈ సుందరి.. ఒక్కసారిగా టార్గెట్ అయిపోయింది. జల్లికట్టును వ్యతిరేకిస్తూ పెట్టిన ఒకే ఒక్క ట్వీట్.. అమ్మడి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయడమే కాదు.. అందరూ ఆమెపై విమర్శలు గుప్పించడానికి టార్గెట్ అవుతోంది.

జంతు ప్రేమికురాలిగా పెటాకు ప్రచారం చేసింది త్రిష. జంతువులపై అంత ప్రేమ కురిపించే ఈమె.. వెజిటేరియన్ కాదు. పక్కా నాన్ వెజిటేరియన్ ఈ భామ. పబ్బులు.. పార్టీల్లో అమ్మడు నాన్ వెజ్ కుమ్మేస్తున్న ఫోటోలు చాలానే నెట్ లో ఉంటాయి. సరిగ్గా ఇదే పాయింట్ ను పట్టుకుని త్రిషను ఏకేస్తున్నారు నెటిజన్లు. తన అకౌంట్ ను హ్యాక్ చేసి ఎవరో ఆ పోస్ట్ చేశారంటూ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి.. ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ చేసి.. ఈ వివాదంలోంచి తప్పించుకుందామని ట్రై చేసింది త్రిష. ఈ మాత్రం పసిగట్టలేనంత అమాయకులు కాదు కదా జనాలు.

అందుకే త్రిష పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ.. ఆమెను రఫ్పాడించేస్తున్నారు. విమర్శల్లో ముంచెత్తుతున్నారు. నాగ్ భార్య అమల మినహాయిస్తే.. పెటాలో చాలా మంది సభ్యులు నాన్ వెజ్ ప్రియులే అంటారు. మరి మాంసాహారం ఫుల్లుగా లాగించేస్తూ.. జంతు ప్రేమ అనడం.. త్రిషను అడ్డంగా ఇరికించేసిన పాయింట్ అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News