తెర మీద అందంగా కనిపించే కథానాయిక జీవితాల్లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. తెర మీద కనిపించేంత వరకే వారు బాగుంటారు ఒక్కసారి వారి జీవితాల్లోకి తొంగిచూస్తే వారి అసలు విషయం అర్థమవుతుంది. రంగుల ప్రపంచంలో ఏదో సాధిద్దామని వచ్చిన భామలు కొందరు గమ్యస్థానానికి ముందే కెరీర్ టర్న్ తీసుకుంటే కొందరు కెరీర్ పీక్స్ లో ఉండగా వెనక్కి తగ్గుతారు. అయితే కొన్నాళ్లు సినిమాల్లో అలరించి ఎంచక్కా పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకున్న వారు ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉంటున్నారు.
సినిమాల్లో నటించి ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్న వారి గురించి ఇప్పుడు చూస్తే.. ముందుగా ఈ వరుసలో సీనియర్ యాక్ట్రెస్ కాంచన వస్తారు. తెలుగు, తమిళ భాషల్లో అందాల తార గా పేరు తెచ్చుకున్న కాంచన కెరీర్ ఫాం తగ్గాక పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నారు. ఆమెను పెంచిన పేరెంట్స్ ఆస్తి విషయంలో ఆమెను మోసం చేయడంతో జీవితం మీద విరక్తి వచ్చిన ఆమె పెళ్లి చేసుకోకుండా అలా సింగిల్ గానే ఉన్నారు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో నాయనమ్మ పాత్రలో కాంచన నటించిన విషయం తెలిసిందే.
ఇక సీనియర్ యాక్ట్రెస్ లలో పెళ్లి చేసుకుండా ఉన్న వారిలో ఆషా పరేఖ్ కూడా ఒకరు. ఆమె వయసు 80 ఏళ్లు. 1952లోనే సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. దాదాసాహెబ్ ఫ్హాల్కే అవార్డు సైతం అందుకున్నారు ఆశా ఫరేఖ్.
మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఒకప్పటి తార శోభన కూడా 50 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో ఆమె పెళ్లాడుతారని వార్తలు రాగా తను సింగిల్ గానే సంతోషంగా ఉన్నానని ఆమె వెల్లడించారు. ఒక స్టార్ హీరోతో శోభన ప్రేమ ఫెయిల్ అవడమే ఆమె అలా బ్యాచిలర్ గా ఉండిపోవడానికి కారణమని అందరు చెప్పుకుంటారు. ఇక ఇదే లిస్ట్ లో ఒకప్పటి హాట్ హీరోయిన్ నగ్మా కూడా ఉంది. సౌత్ లో టాప్ లేపిన ఈ అందాల భామ అప్పటి స్టార్స్ అందరితో కలిసి ఆడి పాడింది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న నగ్మా పెళ్లి మాత్రం చేసుకోలేదు. గంగూలీతో ప్రేమాయణం నడిపించిన అమ్మడు ఆ తర్వాత పెళ్లి ఊసు ఎత్తలేదు. అంతేకాదు హీరోలతో ఆమె డేటింగ్ వార్తలు అప్పట్లో హెడ్ లైన్స్ లో ఉండేది.
అందాల భామ అమీషా పటేల్ బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా నటించింది. వయస్సు 50కి దగ్గర అవుతున్నా సరే స్టిల్ బ్యాచిలర్ గా ఉంది ఈ అమ్మడు. పెళ్లి చేసుకునే ఆలోచన కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇక బాలీవుడ్ మోడల్ నర్గీస్ ఫక్రీ పాకిస్తాన్ నుంచి వచ్చింది. రణ్ బీర్ కపూర్ తో రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హిందీ నిర్మాతతో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆమె పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇదే లిస్ట్ లో బాలీవుడ్ భామ సుస్మిత సేన్ కూడా ఉంది. పరిచయం పెద్దగా అవసరం లేని సుస్మితా సేన్ కూడా స్టిల్ బ్యాచిలర్ గా ఉంది. కొన్నాళ్లు రొమన్ పాల్ తో ప్రేమలో ఉన్న ఈ అమ్మడు అతనితో విడిపోయింది. ప్రస్తుతం లలిత్ మోడీ తో ప్రేమాయాణం సాగిస్తుందని తెలుస్తుంది.
సీనియర్ హీరోయిన్ సితార ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. తమిళ హీరోతో ప్రేమ వల్లే ఈమె పెళ్లికి దూరంగా ఉందని టాక్. ఒక హీరోని ప్రాణంగా ప్రేమించడం అతను మరణించడం వల్లే ఆమె పెళ్లి మీద ఆశలు వదులుకుందట. పేరెంట్స్ కి చాలా క్లోజ్ అయిన సితార పెళ్లైతే వారిని ఎక్కడ విడిచి వెళ్లాల్సి వస్తుందో అని పెళ్లి చేసుకోలేదని కొందరు అంటుంటారు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ టబు ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఒక స్టార్ హీరోతో ఎఫైర్ ఆమె పెళ్లికి దూరమయ్యేలా చేసిందని వార్తలు వచ్చాయి. కానీ టబు మాత్రం తన సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది.
గ్లామర్ ఫీల్డ్ కి ఎంట్రీ ఇచ్చి అందరిలా ఇక్కడ కొంతకాలం సంపాదించి పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ లీడ్ చేయకుండా ఇంకా బ్యాచిలర్ గా ఉంటూ సినిమాలు చేస్తున్నారు ఈ కథానాయికలు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.