టైటానిక్‌ హీరో చుమ్మా అడిగితే ఇచ్చేస్తా!!

Update: 2015-04-08 07:30 GMT
క్యూట్‌లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో కొలువుదీరింది అదాశర్మ. తొలిసినిమా హార్ట్‌ ఎటాక్‌తో తెలుగు యువత మనసుల్లోకి దూరిపోయింది. అందుకే ఇప్పుడు బన్ని సరసన 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో బన్నీ ఎనర్జీ లెవల్స్‌కి పడిపోయానని చెబుతున్న ఈ భామ రియల్‌లైఫ్‌లో ఎవరికి పడిపోయారు? అని ప్రశ్నిస్తే ఓ హాలీవుడ్‌ హీరో పేరు చెప్పింది.

లియోనార్డో డికాప్రియో అంటే చాలా ఇష్టం. టైటానిక్‌ సినిమాలో తనని చూసి పడిపోయాను. ఆ వెంటనే నా బెడ్‌రూమ్‌లో గోడలపై అతడి ఫోటోల్ని అతికించుకున్నా. టీనేజీ వయసులో ఆ సినిమా చూసి ఫ్లర్ట్‌ అయిపోయాను. డికాప్రియో నా ఫేవరెట్‌ హీరో. తను అడగాలే కానీ ఏదైనా ఇచ్చేస్తా.. అని చెప్పింది. బన్నీ గురించి కూడా ముచ్చటిస్తూ .. ఆన్‌సెట్స్‌ బన్నీ నుంచి చాలా నేర్చుకున్నా. తన డెడికేషన్‌ అసాధారణం. ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో ఎంతో హార్డ్‌వర్క్‌ చేస్తాడు. అలాగే కామెడీ టైమింగ్‌ కూడా నేర్చుకున్నా. నలుగురితో కలిసి ఒక సన్నివేశంలో నటించేప్పుడు అందరికీ సరితూగే కామెడీ టైమింగ్‌ కావాలి. అదెలాగో సన్నాఫ్‌ సత్యమూర్తి వల్లే తెలిసింది.. అంటోంది

త్రివిక్రమ్‌ ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌. అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సహనటీమణుల్లో నిత్యామీనన్‌, సమంత ఇద్దరూ నా అభిమాన తారలు. నిత్యాతో కలిసి నటించే సన్నివేశం లేదు కానీ, సమంతతో కొన్ని నిమిషాల పాటు నటించే అవకాశం వచ్చింది. అందుకు హ్యాపీగా ఉన్నా అని చెప్పింది. ఆల్‌ ది బెస్ట్‌ బేబి.
Tags:    

Similar News