చేతిలో తుపాకి.. ఒంటిలో మెరుపులు..

Update: 2016-11-04 09:30 GMT
టాలీవుడ్ టు బాలీవుడ్ ఏ ఇండస్ట్రీలో అయినా బ్యూటీ ఆదాశర్మకు క్రేజ్ బాగానే ఉంటుంది. గతంలో అయితే కెరీర్ లో హిట్స్ లేవనే కొరత అయినా ఉండేది కానీ.. క్షణం తర్వాత ఆ ట్రెండ్ కూడా మారిపోయింది. క్షణం మూవీని ఏ భాషలో తీసేందుకు ప్రయత్నిస్తున్నా.. అన్ని చోట్లా ఆదాశర్మ రోల్ ఆమెకే ఆఫర్ చేస్తున్నారంటే.. యాక్టింగ్ తో ఏ రేంజ్ లో మెప్పించేసిందో అర్ధమవుతుంది.

వచ్చిన క్రేజ్ ని అవకాశాలుగా మార్చుకోవడం కోసం.. తన స్థాయిని మరింత పెంచుకుని సెటిల్ అయిపోవడం కోసం.. ఆదాశర్మ ఫోటో షూట్స్ ని ఆశ్రయించేసింది. బ్లాక్ డ్రెస్ లో చేతిలో తుపాకి పట్టుకుని ఇచ్చిన పోజ్ అదిరిపోయిందంతే. ఓ పక్కకి తీరిగి పోజ్ ఇవ్వడంతో.. పై నుంచి కింది వరకు అమ్మడి పర్సనాలిటీలో వంపులు ఫ్యాన్స్ కి కనుల విందు చేసేస్తున్నాయి. డ్రస్ కి ఉన్న కట్స్ లోంచి అమ్మడి నడుము అందాలను చూసి.. చాలా మంది కెవ్వ్ కేక అని పాడేసుకుంటున్నారు కూడా.

సరైన ఛాన్స్ ఇంకోటి పడిందంటే స్టార్ హీరోయిన్ అయేందుకు అన్ని అందాల అర్హతలు ఉన్న ఆదాశర్మ.. ఇప్పటికైతే రెండు బాలీవుడ్ సినిమాల్లో చేసేస్తోంది. అనురాగ్ బసు తీస్తున్న జగ్గా జాసూస్.. విద్యుత్ జమాల్ కి జోడీగా నటిస్తున్న కమాండో2 అమ్మడి కెరీర్ కి బిగ్ టర్న్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News