అదా ఒంపు సొంపుల వ‌య్యారాల వ‌డ్డ‌న‌లు

Update: 2020-11-06 12:30 GMT
సోష‌ల్ మీడియాల్లో అల్ల‌రి వేషాల‌తో చెల‌రేగే భామల్లో నంబ‌ర్ వ‌న్ గా నిలుస్తుంది అదా శ‌ర్మ‌. నిరంత‌రం ఏవో కొంటె వేషాల‌తో ఆక‌ట్టుకునే వీడియోలు షేర్ చేస్తుంది. వేడెక్కించే ఫోటోల‌తో ఇన్ స్టాని వ‌దిలి పెట్ట‌కుండా యంగేజ్ చేయ‌డంలో అదా శ‌ర్మ స్కిల్ ని ఎంతైనా మెచ్చుకుని తీరాలి.

అస‌లు సినిమాలేవీ లేకుండానే అదాకి అసాధార‌ణంగా ఇన్ స్టా ట్విట్ట‌ర్ ఫాలోయింగ్ పెరిగిందంటే త‌న‌లోని ఆక‌ట్టుకునే ఈ నైపుణ్యం వ‌ల్ల‌నే. ట్విట్ట‌ర్ వీడియోల్లో అదా చూపించే అసాధార‌ణ క్రియేటివిటీ ఇప్ప‌టికే అభిమానుల మైండ్ లో రిజిస్ట‌ర్ అయిపోయింది.

తాజాగా ఈ అమ్మ‌డు షేర్ చేసిన ఓ ఫోటో అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఇటీవ‌లే గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొక్క‌లు నాటిన అదా ఒకానొక ఫోటోషూట్ లో ఒంపు సొంపుల వ‌య్యారాల వ‌డ్డ‌న‌ల‌తో వేడెక్కించింది.

ఇదేనా.. వేరొక వీడియోలో అదా శ‌ర్మ క‌ర్ర‌సాము అద‌ర‌గొట్టేసింది అంతే. దేశి బాడీగార్డ్ ఎవరికి కావాలి? ఇప్పుడే పేర్లు నమోదు చేసుకోండి! అంటూ టీజ్ చేసింది. క‌ర్ర‌తిప్ప‌డంలో త‌న‌కి సాటి రారు అన్న‌ట్టుగానే స్కిల్ తో అద‌ర‌గొట్టింది. అస‌లు ఈ అమ్మ‌డి ప్ర‌తిభ‌ను త‌క్కువ చేసి చూడ‌లేం. నేను నవంబర్ 29 వరకు అందుబాటులో ఉన్నాను. అప్పుడు # కమాండో 3 విడుదలవుతుంది..భావనారెడ్డి చాలా బిజీ. కాసేపు ప్రాక్టీస్ చేస్తున్నాను..నా కాళ్ళపై ఆ గాయాలు గుర్తున్నాయా? అంటూ క‌ర్ర తిప్పుతూ నైపుణ్యం చూపించింది అదా.

మార్షల్ ఆర్ట్స్ సామర్ధ్యాలు అందం లో మీరు అగ్రస్థానంలో ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ విద్య‌ చాలా మందికి స్ఫూర్తి.. అంటూ ఓ అభిమాని ఎంతో ఎగ్జ‌యిట్ అయిపోయాడు ఆ వీడియో చూసి.

కళ్ళు తెరిచి కలలు కంటున్నది ... షార్క్ లాగానే అంటూ వేరొక ఫోటోని కూడా అదా శ‌ర్మ షేర్ చేసింది. వందేళ్ల అదా అంటూ కొంటెగా క‌వ్వించేసింది. అలాగే మహమ్మారిలో ప్రారంభించి పూర్తి చేసిన మొదటి తెలుగు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వీక్షించండి.. ఈ మూవీకి
విప్రా దర్శకత్వం వహించారు. గౌరీ కృష్ణ నిర్మించారు. ర‌ఘు కుంచె సంగీతం అందించారు అని తెలిపింది.
Tags:    

Similar News