అందంతో పాటు అదృష్టం ఉండాలి

Update: 2017-08-23 17:30 GMT
సాధారణంగా హీరోయిన్స్ మొదట టాలీవుడ్ లో నటించి మెల్లగా తమిళ్ హిందీలో ఛాన్సులు కొట్టేస్తారు కానీ ఆదశర్మ మాత్రం ఎవరు ఊహించని విధంగా హిందీ సినిమాలతో కెరీర్ ను స్టార్ట్ చేసి తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2008 లో బాలీవుడ్ హర్రర్ సినిమా "1920" తో వెండితెరకు పరిచయం అయినా ఆద శర్మ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని హిట్ ను కొట్టేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని తెలుగు-హిందీలో ఎన్ని సినిమాలు తీసినా ఈ అమ్మడి అదృష్టం మారలేదు.

ప్రస్తుత రోజుల్లో హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకర్షిస్తున్నారు. ముందు సోషల్ మీడియాలో ఫోటోలను వదిలి.. ఆ ఫొటోలు వైరల్ అయ్యాక ఛాన్సులను దక్కించుకుంటున్నారు. అదే తరహాలో రన్ రాజా రన్ సుందరి సీరత్ కపూర్ కి ఛాన్సులు రాకపోవడంతో ఆ మధ్య ఇచ్చిన హాట్ ఫోటో షూట్స్ కి దెబ్బకి రెండు పెద్ద సినిమాల్లో ఛాన్సులను కొట్టేసింది.  ఒకటి నాగ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న రాజు గారి గది సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమాలో స్పెషల్ రోల్ లో అలరిస్తుండగా.. రవి తేజ - టచ్ చేసి చూడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

దీంతో ఇదే తరహాలో అదశర్మ కూడా తన అందాలను ఎరగా వెయ్యడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఎంత ఆరబోసినా కూడా సీరత్ లాగా ఈ అమ్మడికి ఛాన్సులు దొరకడం లేదు. మరి ఛాన్సులకోసం ఇంకేం చేస్తుందో చూడాలి. ఏమన్నా అదృష్టం కలిస్తేనే అమ్మడికి కాస్త ప్లస్ అవుతుందని అంటున్నారు సినిమావాళ్ళు. లెటజ్ సీ. 
Tags:    

Similar News