చెల్లితో కలిసి సినిమాలో.. నిజం కాదన్న ఆదిపురుష్‌ హీరోయిన్‌

Update: 2021-07-21 09:30 GMT
టాలీవుడ్‌.. బాలీవుడ్‌ ఇలా అన్ని భాషల్లో కూడా వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్‌. హీరోయిన్స్‌ వారి పిల్లలను హీరోయిన్స్ గా హీరోలుగా పరిచయం చేయడం కొత్తేమి కాదు. అలాగే హీరోయిన్స్ వారి చెల్లిని హీరోయిన్‌ గా తీసుకు రావడం కూడా కొత్త కాదు. హీరోయిన్స్ గా సక్సెస్ లు దక్కించుకున్న వారు వారి చెల్లెల్లను తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. కరిష్మ కపూర్‌ సోదరి కరీనా కపూర్‌ ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. అప్పట్లో శ్రీదేవి చెల్లి కూడా హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది. తెలుగు లో కాజల్‌ చెల్లి నిషా కూడా హీరోయిన్‌ గా చేసింది. కొందరి చెల్లెల్లు సక్సెస్‌ అవ్వగా కొందరు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లి పోయారు.

ఇండస్ట్రీకి మరో చెల్లి వారసురాలిగా ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. ఆదిపురుష్‌ సినిమాలో ప్రస్తుతం హీరోయిన్‌ గా నటిస్తున్న స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవలే ఈయన అక్షయ్‌ కుమార్‌ తో కలిసి ఒక మ్యూజిక్ ఆల్బంలో నటించింది. సోషల్‌ మీడియా ద్వారా మరియు మ్యూజిక్‌ ఆల్బం ద్వారా ఇప్పటికే బాలీవుడ్ లో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నుపుర్‌ సనన్‌ త్వరలో జాకీ ష్రాఫ్‌ సినిమాలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఆ సినిమా లో మెయిన్‌ హీరోయిన్‌ గా కృతి సనన్‌ నటిస్తుండగా సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకు గాను ఆమె చెల్లి నుపుర్‌ సనన్‌ ను ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపించింది. కాని ఆ వార్తలు నిజం కాదని కృతి సనన్‌ క్లారిటీ ఇచ్చింది. తన చెల్లి హీరోయిన్ గా నటించబోతుంది. అది నేను నటిస్తున్న సినిమా మాత్రం కాదు. సోలో హీరోయిన్ గా తన ఎంట్రీ ఉంటుందని కృతి ప్రకటించింది. చెల్లి ప్రస్తుతం యాక్టింగ్‌ మరియు డాన్స్ ల్లో శిక్షణ పొందుతున్నట్లుగా కూడా కృతి పేర్కొంది. హీరోయిన్‌ గా ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్ గా దూసుకు పోతున్న కృతి సనన్ తన చెల్లిని కూడా స్టార్‌ గా నిలిపేందుకు మొదటి సినిమా నే పక్కా కమర్షియల్‌ మూవీగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. కమర్షియల్‌ పాత్రలో నుపుర్‌ సనన్‌ కనిపించి మెప్పించనుంది అంటూ కృతి సనన్‌ చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా నుపుర్‌ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా స్కిన్ షో ను చేసేందుకు సిద్దం అన్నట్లుగా నుపుర్‌ సినిమాల్లో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి అక్క మాదిరిగా నుపుర్ సనన్‌ కూడా బాలీవుడ్‌ లో సక్సెస్ అయ్యి స్టార్‌ గా పేరు దక్కించుకుంటుందా చూడాలి. కృతి సనన్‌ ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా ఆది పురుష్‌ సినిమా లో మాత్రమే కాకుండా హిందీలో మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. సౌత్‌ లో కూడా ఈమె వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News