ప్రభాస్ మొదటి హిందీ సినిమా 'ఆదిపురుష్' షూటింగ్ మొన్నటి వరకు ముంబయిలో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్ తో నిర్మాణం జరుపుకుంది. కీలక సన్నివేశాలను ప్రభాస్ మరియు ఇతర యూనిట్ సభ్యులపై చిత్రీకరించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆదిపురుష్ సినిమా కరోనా వల్ల ఏమాత్రం ప్రభావితం కాలేదని ముందు నుండి అనుకున్నట్లుగానే షూటింగ్ జరుగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 15 నుండి హైదరాబాద్ లో షూటింగ్ కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయంటూ సమాచారం అందుతోంది.
హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్ లో దాదాపుగా రెండున్నర నుండి మూడు నెలల పాటు చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా చెబుతున్నారట. ఈ షెడ్యూల్ లో కూడా రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ తో పాటు సీత పాత్రలో కనిపించబోతున్న కృతి సనన్ మరియు లంకేష్ పాత్రలో కనిపించబోతున్న సైఫ్ అలీ ఖాన్ లు పాల్గొనబోతున్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలకమైన ఎమోషనల్ డ్రామా సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారని చెబుతున్నారు. ముందు నుండి అనుకున్నట్లుగానే హైదరాబాద్ షెడ్యూల్ కొనసాగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు బలంగా చెబుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తో భారీ ఎత్తున కేసులు పెరుగుతున్నా కూడా ఆదిపురుష్ ను మాత్రం ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఆ రాముడే ఈ సినిమాను ముందుండి నడిపిస్తున్నట్లుగా ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆదిపురుష్ సినిమా షూటింగ్ కు కరోనా దెబ్బ పడలేదని.. ముందు ముందు కూడా ఆదిపురుష్ సాఫీగా సాగుతుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.