#ఆదిపురుష్ 3డి.. రామాయణం నియాండర్తల్ యుగం వరకు..!

Update: 2021-04-20 04:38 GMT
ఓంరౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్ 3డి క‌థాంశంలో ఒక్కో ట్విస్టును ద‌ర్శ‌కుడే స్వ‌యంగా ఓపెన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుంటే.. సీత‌గా కృతి స‌నోన్.. లంకేయునిగా సైఫ్ ఖాన్ న‌టిస్తున్నారు. ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో స‌న్నీసింగ్ క‌నిపిస్తారు. 30 వేల ఏళ్ల నాటి క‌థ‌తో రామాయ‌ణం లింకులు ఉన్నాయ‌ని ఓంరౌత్ ఇంత‌కుముందే వెల్ల‌డించారు.

ఈ సినిమా క‌థ కొన్ని వేల ఏళ్ల నాటి కాల‌మానాన్ని చూపిస్తుంది. . రామాయణం పురాణాల నుంచి నియాండర్తల్ యుగం వరకు..!  చాలా సుదీర్ఘ‌మైన జాతి మ‌నుగ‌డ‌ను విశ్లేషిస్తుంది. ఇందులో పాత రాతి యుగం కూడా ఉంటుంద‌ని ఓంరౌత్ మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఆది పురుష్ అనేది పురాణాలకు చరిత్రకు మధ్య వారధిగా క‌నిపిస్తుంద‌ని భావిస్తున్నారు. మానవజాతి పూర్వ సాంకేతిక చరిత్రలో 99శాతానికి ప్రాతినిథ్యం వహించిన రాతి పనిముట్లను తయారు చేసిన కాలం పాతరాతియుగం. దీన్ని ప్రాచీన శిలాయుగం అని ఇంగ్లీషులో పేలియోలిథిక్ ఎరా అనీ పిలుస్తారు. మానవులు తొట్టతొలి రాతి పనిముట్లను తయారుచేసి ఉపయోగించిన సమయం - 33 లక్షల సంవత్సరాల క్రితం - నుండి 11650 సంవత్సరాల క్రితం నాటి ప్లైస్టోసీన్ ఇపోక్ ముగింపు వరకూ పాతరాతియుగం విస్తరించింది. కాలం యుగం సమయం అనేది మనవ జాతి చరిత్రలో ఒక అధ్యయనం. మనవ జీవితంలోని సాంకేతిక పరిజ్ఞానంలోని 95శాతం శాతం ఈ పాతరాతియుగం కాలంలోనే రాతి ఆయుధాలు వినియోగంచుకోవడం వంటివి అసాధార‌ణ‌మైన‌వి.

సి. 50000 - సి. 40000 వరకు మొదటి మానవులు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టారు. సి. 45000 సంవత్సరాల క్రితం నాటికి మానవులు ఐరోపాలో 61 ° ఉత్తర అక్షాంశంలో నివసించారు. సి. 30,000 సంవత్సరాల క్రితం నాటికి జపాను చేరుకుంది, సి. ఆర్కిటికు సర్కిలు పైన సైబీరియాలో 27000 సంవత్సరాల క్రితం మానవులు ఉన్నారు. ఎగువ పాతరాతియుగం చివరిలో మానవుల సమూహం బెరింగియాను దాటి అమెరికా అంతటా త్వరగా విస్తరించింది. ఈ చ‌రిత్ర అంతా దాటుకుని వ‌చ్చాక మాన‌వ జాతి క‌థ ఆస‌క్తిక‌రం.

ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇలాంటి ఆస‌క్తిక‌ర హిస్టారిక‌ల్ పాయింట్స్ ని ట‌చ్ చేస్తున్నార‌ట‌. ఈ చిత్రం పురాణ రామాయణం ఆధారంగా తెర‌కెక్కుతున్నా చ‌రిత్ర‌ను మిక్స్ చేస్తున్నారు.
30000 సంవత్సరాల క్రితం చారిత్రక నేపథ్యంలోని చిత్ర‌మిద‌ని తెలిపారు. ఇందులో ప్ర‌భాస్ రూపం ర‌క‌ర‌కాలుగా మారుతుంది. ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నున్నాడు.

రామాయణం పురాణాల మధ్య నియాండర్తల్ యుగం వరకు అంతరాన్ని తగ్గించే క‌థ‌నం చూపిస్తారట‌. రామాయణంలో చూపించిన వాన‌రాలు 30వేల‌ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన చారిత్రాత్మక కాలంలో నియాండర్తల్ లకు మ‌రు రూపంగా క‌నిపిస్తాయి. ఇలాటి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఆదిపురుష్ 3డిలో చ‌ర్చిస్తార‌ట‌.

కోవిడ్ -19 ప్రోటోకాల్స్ న‌డుమ‌ ఇప్పటికే 30శాతం షూటింగ్ పూర్త‌యింది. ఇక త‌న శ‌రీర రూపం కోసం ప్ర‌భాస్ ప్రతిరోజూ శ్రమపడుతున్నాడని ఆన్ లొకేష‌న్ కూడా చాలా శ్ర‌మిస్తున్నాడ‌ని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు.
Tags:    

Similar News