నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ లో టాలెంటెడ్ బ్యూటీ..?

Update: 2020-12-04 05:51 GMT
టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ - 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''మహా సముద్రం''. 'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి - గార్జియస్ అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే అదితి రావు ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఆమె ఇలాంటి పాత్రలో కనిపించడం మొదటిసారని చెప్పవచ్చు. తెలుగులో ఈ మధ్య హీరోయిన్ గా నటించిన 'వి' సినిమాతో ప్లాప్ అందుకున్న హైదరీ.. ఈసారి నెగిటివ్ రోల్ తో హిట్ అందుకుంటుందేమో చూడాలి.

కాగా, ఇటీవల విడుదలైన 'మహా సముద్రం' థీమ్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఒక వైపు ప్రేమను మరొక వైపు యుద్ధాన్ని ప్రతిబింబించేలా ఈ టైటిల్ పోస్టర్ డిజైన్ చేయబడింది. ఇది ఎనిమిదేళ్ల తర్వాత సిద్దార్థ్ తెలుగులో నటిస్తున్న సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి రాజ్ తోటా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూర్చనున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్.. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News