శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. Rx 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు (సోమవారం) హీరోయిన్ అదితిరావు హైదరి మీడియాతో ముచ్చటించారు.
మహా అనే అమ్మాయి స్వీట్, హార్డ్ వర్కింగ్. నిజాన్ని చెప్పే గుణం ఉంటుంది. పారదర్శకత్వంతో ప్రవర్తిస్తుంటుంది. నాకు మహా పాత్రను పోషించడం ఎంతో ఆనందంగా ఉంది. మహా తన కుటుంబాన్ని పోషిస్తూ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటుంది.
అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమాను చూశాను. ఎమోషన్స్ మీద ఆయనుకున్న కమాండ్ నాకు నచ్చింది. సినిమాను సెలెబ్రేట్ చేసే డైరెక్టర్ అజయ్ భూపతి. ఆయన కథ చెప్పే విధానం కూడా బాగుంటుంది. తన సినిమాలోని ప్రతీ పాత్రను ప్రేమిస్తాడు. అందుకే కథ అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు హీరోలు, జగపతి బాబు, రావు రమేష్ లాంటి నటీనటులున్నారు. మంచి మ్యూజిక్ కూడా ఉంది. రెండేళ్ల క్రితం ఈ స్క్రిప్ట్‌ను నాకు వినిపించారు. అయితే ప్రతీ రెండు నెలలకు ఒకసారి అజయ్ భూపతి ఫోన్ చేసేవారు. డేట్స్ ఇవ్వమని అడిగేవారు. నీతో చేయాలని అని చెప్పేవారు. నేను ఉన్నా లేకపోయినా ఈ చిత్రం బాగుంటుంది. కచ్చితంగా చేయాలని అజయ్ భూపతికి చెప్పాను. కానీ నేను మాత్రమే కావాలని అనేవారు.
నేను వర్క్ చేసిన ప్రతీ దర్శకుడు నన్ను బాగా చూపించారు. నాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేమంతా కూడా అజయ్ భూపతి ఫ్యాన్స్. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. ఆయన తన చిత్రాన్ని ఎంత బాగా ప్రేమిస్తాడో.. మిగతా వారు కూడా అంతే ప్రేమించాలని అనుకుంటారు. షూటింగ్ మొత్తం ఎంతో సరదాగా జరిగింది. అజయ్ గారి విజన్‌పై మాకు గౌరవం ఉంది. అయితే హీరోలను అజయ్ భూపతి గురించి అడిగితే.. నన్ను మాత్రమే పొగిడేవారు అని వాళ్లు చెబుతారు. ఎప్పుడైనా ఒక్కసారైనా మా క్కూడా అలా చెబుతారు అని బాయ్స్ ఎదురుచూసేవారు. కానీ అజయ్ భూపతి గారు మాత్రం ఓ..కే.. అని అనేవారు. అదే నేను చేస్తే మాత్రం.. వావ్.. సూపర్.. యూ ఆర్ మై ఏంజిల్ అని చెప్పేవారు. (నవ్వుతూ)
ఇప్పటికే రెండు ట్రైలర్‌లు కట్ చేశారు. అయినా కూడా స్టోరీని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అదే మా సినిమాకు పెద్ద సక్సెస్.
నాకు ప్రేమ కథలంటే చాలా ఇష్టం. సరైన కథ, సరైన దర్శకుడి కోసం నేను ఎదురుచూస్తుంటాను. అజయ్ గారు ప్రేమ కథ అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. కొలవలేనంత ప్రేమ అనేది నేను కూడా నమ్ముతాను. ప్రతీ బంధంలోనూ ప్రేమ ఉంటుంది. ఇమ్మెజరబుల్ లవ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ప్రేమ అనేది ముఖ్యం. ప్రతీ ఒక్కరూ పరస్పర ప్రేమ, గౌరవాలతో మెలగాలి.
ప్రతీ ఒక్క పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మహా ఇలా నవ్వకూడదు.. మహా ఇలా ఏడ్వకూడదు.. ఇలా నవ్వాలి.. అలా ఏడ్వాలి అని చెప్పేవారు. నాకు చాలెంజింగ్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ నాకు మణిరత్నం నా గురువు. నేను స్టార్‌లా సెట్ మీదకు రాను. ఓ నటిగా వస్తాను. నేర్చుకునేందుకు వస్తాను. దర్శకుడే నా గురువు. వాళ్లు చెప్పింది చేస్తాను. మహా పాత్రకు ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తాను. అందులో నా స్టైల్ కూడా జోడించేందుకు ప్రయత్నిస్తాను. మహాను ప్రేక్షకులు ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను.
అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో ఎన్నో పాత్రలున్నాయి. ఇందులో స్నేహం గురించి కూడా ఉంటుంది. సిద్దు, శర్వ అద్భుతంగా నటించారు. సిద్దు కూడా మణిరత్నం సర్ స్టూడెంట్. ఫిల్మ్ మేకింగ్‌లో సిద్దుకు చాలా నాలెడ్జ్ ఉంది. ఎడిటింగ్, మ్యూజిక్, లిరిక్స్ ఇలా అన్నింటిపై పట్టు ఉంది. భాష మీద ఎక్కువ పట్టు ఉంది. శర్వా అయితే సటిల్ యాక్టర్. ఎంతో సైలెంట్‌గా ఉంటారు. వారిద్దరూ ఎప్పుడూ కూడా హీరోల్లా ప్రవర్తించలేదు. విజయ్, అర్జున్, మహాల్లా సెట్ మీద ఉండేవాళ్లం. ఇది స్క్రిప్ట్ బేస్డ్ కథ. ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అనేది ఉండదు. మేం అంతా కలిసి సినిమాను నిలబెట్టేందుకు ప్రయత్నించాం. ఈ సినిమాకు కథే హీరో.
అజయ్ భూపతి గారు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు. మణిరత్నం గారికి అభిమాని కూడా. అలా మొత్తానికి సెట్‌లో ముగ్గురు మణిరత్నం విద్యార్థులున్నాం. ఇక అజయ్ భూపతి గారు ఆర్జీవీ శిష్యుడు. చెలియా సినిమాలో మణిరత్నం గారు అద్భుతంగా చూపించారు. నేను ఇప్పుడు మహాను చూపిస్తాను అని కెమెరామెన్ రాజ్ తోట అన్నారు.. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆయన అంతకు ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని తెలిసి షాక్ అయ్యాను. ఆర్ ఎక్స్ 100 పాటలు పెట్టుకుని వింటూ ఉంటాను. ఇప్పుడు మహా సముద్రం పాటలు వింటున్నాను. ఎండలో పని చేసి మొత్తం ఎర్రగా అయ్యాను. రొయ్యల్లా మారిపోయాను. దాదాపు షూటింగ్‌లో చెప్పులు లేకుండానే ఉన్నాను. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు.
నేను ఇక్కడే పుట్టాను. కానీ పెరిగింది మాత్రం నార్త్‌లోనే. నాకు తెలుగు అంతగా రాదు. కానీ నాకు డైలాగ్స్ ఇస్తే.. అర్దరాత్రి లేపి సీన్ నంబర్ చెబితే కూడా డైలాగ్ ఇట్టే చెబుతాను. అలా నేను బట్టిపట్టేస్తాను. ఎందుకంటే సెట్‌కు వస్తే.. మిగతా వాళ్ల సమయం వృథా చేయాలని అనుకోను. అందుకే నా డైలాగ్స్‌ను ముందే ఇవ్వమని చెబుతాను. ప్రాక్టీస్ చేసుకుని వస్తాను. నా వాయిస్‌లోనే నేను చెబుతాను. ఓసారి ఇలానే డైలాగ్ పేపర్ ఇచ్చారు. ప్రాక్టీస్ చేసేలోపే పిలిచారు. రెడీ అని చెప్పాక.. నేను ఒక్క క్షణం కూడా సమయం వృథా చేయను. కానీ ఆ రోజు మాత్రం అలా అనేసరికి కంట్లోంచి నీరు వచ్చింది. అజయ్ భూపతి గారు వచ్చారు. పది నిమిషాలు తీసుకోండి ఏం పర్లేదు అని అన్నారు. పది నిమిషాలు వద్దు.. రెండు నిమిషాలు చాలు అని వచ్చాను. డైలాగ్స్ చెప్పేశాను. మీరు ఏడుస్తూ ఉంటే ఎంతో క్యూట్‌గా ఉంది అదితీజి అని అజయ్ భూపతి గారు అనడంతో సెట్‌లో అందరూ నవ్వేశారు.
మహా పాత్రకు డబ్బింగ్ చెప్పాలని అనుకున్నాను. కానీ మహా వైజాగ్ అమ్మాయి. హైద్రాబాద్ అమ్మాయి కాదు. స్క్రిప్ట్ ప్రకారం వైజాగ్ అమ్మాయిలానే డబ్బింగ్ చెప్పాలి. అలా చెప్పలేను.. నేను సంతృప్తి చెందలేను.. సమయం ఎక్కువ పడుతుంది అని నేను చెప్పలేదు. మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి అని అజయ్ భూపతితో అన్నాను. వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. కానీ అజయ్ భూపతి తదుపరి చిత్రంలో పది రోజులు అయిన సరే వెయిట్ చేసి నేనే డబ్బింగ్ చెబుతాను. నేను కచ్చితంగా ప్రతీ దర్శకుడితో రెండు సినిమాలు చేస్తాను. అలా అజయ్ భూపతి గారితోనూ చేసే అవకాశాలున్నాయి.
సినిమాలోని క్యారెక్టర్స్ గురించి అజయ్ భూపతి ఎంతో వివరిస్తారు. విజయ్, అర్జున్, మహా అని ఎప్పుడూ చెబుతుంటారు. ఎలాంటి ప్రిపరేషన్ చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. డైరెక్ట్‌గా సెట్‌కు రావాలి. ఆయన చెప్పింది చేయాలి. అలా పని చేయడం నాకు ఎంతో ఇష్టం.
బయోపిక్స్‌లో నటించడం నాకు ఇష్టం. నాకు సంగీతం అంటే ఇష్టం. డ్యాన్స్ నేర్చుకున్నాను. అలా ఎంఎస్ సుబ్బలక్ష్మీ గారి బయోపిక్ అయితే బాగుంటుంది. యాక్ట్రెస్ బయోపిక్ కూడా ఇష్టం. ఇప్పటికే అద్భుతమైన సినిమాలు వచ్చాయి. సింగర్, డ్యాన్సర్, యాక్టర్, స్పోర్ట్స్ పర్సన్ ఇలా ఏ బయోపిక్ అయిన నేను చేయగలను. రేఖ గారి బయోపిక్ చేయడం నాకు ఎంతో ఇష్టం. ఆమెను రేఖమ్మ అని పిలుస్తాను.
పొన్నియన్ సెల్వన్ భారీ చిత్రం. మణిరత్నం గారు నా గురువు. ఆయన ఓ పాత్ర సెలెక్ట్ చేసుకున్నారంటే అది కచ్చితంగా బాగుంటుంది. నేను కారెక్టర్‌కు సరిపోతాను అని అనుకుంటే ఆయనే పిలుస్తారు. ఆయనెప్పుడు నన్ను కోరుకుంటే నేను అప్పుడు నటించేందుకు సిద్దంగా ఉన్నాను. పాత్ర కోసం ఆయన్ను నేను ఎప్పుడూ అడగలేదు.
రాళ్లపై చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయడం ఎంతో కష్టంగా అనిపించింది. కానీ నాకు అది ఎంతో నేర్పించింది. దర్శకుడిపై నమ్మకం, గౌరవం ఉంచడం ఎంతో ముఖ్యం. ప్రతీ రోజూ సెట్‌లో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేదాన్ని. నేను ప్రతీ చిత్రానికి అలానే పని చేసేదాన్ని. మహాసముద్రంకు కూడా అలానే పని చేశాను.
దుల్కర్ సల్మాన్-బృందా మాస్టర్ గారితో ఓ చిత్రం చేస్తున్నాను. హిందీలో ఓ ప్రాజెక్ట్ ఉంది. ఇంకొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడే చెప్పలేను. మళయాలంలో కూడా ఓ ప్రాజెక్ట్ చర్చల్లో ఉంది. నేను ఎప్పుడు కూడా దర్శకులు, నిర్మాతల నటిని. నా సినిమాలన్నీ కూడా వారు ప్రకటిస్తేనే బాగుంటుంది.