సినిమాల్లో ఛాన్స్ ఊరికే రాదు. ఎంతో కష్టం ఉంటుంది. అడిగినంతనే అవకాశాలు వచ్చేయవు. దాని కోసం ఎన్నో కష్టనష్టాలు తప్పవు. ఇప్పుడు సక్సెస్ పుల్ గా చెప్పే అడివి శేష్.. సినీ జర్నీలో పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. అమెరికా నుంచి వచ్చి ఫెరారీ కారులో తిరిగే సరదా కుర్రోడన్న ట్యాగ్ ఉన్నప్పటికీ.. అవకాశాల కోసం తానెంత కష్టపడిందీ చెప్పిన వైనం వింటే.. సినిమా ఇండస్ట్రీలో ఎంతవాడికైనా కష్టం తప్పదన్న నిజం అర్థమవుతుంది.
బాహుబలిలో భద్రుడు క్యారెక్టర్ ను సొంతం చేసుకున్న అడివి శేష్.. ఆ అవకాశం తనకు ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళిని తనకో అవకాశం ఇవ్వాలని అడిగిన తీరు చూస్తే.. సినిమాల విషయంలో అడివి శేష్ కున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.
నిర్మాత ప్రసాద్ దేవినేని బర్త్ డే సందర్భంగా తాను చేసిన డ్యాన్స్ బాగుందని రాజమౌళి దగ్గరకు వచ్చి చెప్పారని.. ఆ సమయంలో ఆయనో పెద్ద ఎపిక్ సినిమాకు ప్లాన్ చేస్తున్న సమాచారం తన దగ్గర ఉందన్నారు అడివి శేష్. తన డ్యాన్స్ కు కాంప్లిమెంట్ ఇచ్చిన రాజమౌళిని నేరుగా.. తనకో అవకాశం ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు.
మీరు చేసే సినిమాలో కాఫీ కప్పు పట్టుకొని నడిచే జూనియర్ ఆర్టిస్ట్ గా చేయమన్నాచేస్తానని అడిగినట్లు చెప్పారు. మనం అందరిలాగే అడిగాం.. ఆయన కూడా అందరికీ చెప్పినట్లే చెప్పారని తాను అనుకున్నానని..కానీ ఏడాది తర్వాత ఫోన్ చేసి.. భద్రుడు పాత్ర చేయమన్నారని చెప్పారు. కిస్ మూవీ దారుణ ప్లాప్ అయిన వారానికే బాహుబలి షూటింగ్ మొదలైందన్నారు. అప్పటికీ చాలా డిప్రెషన్ లో ఉన్న తనను బాహుబలి మూవీ తనను మామూలు స్థితికి తీసుకొచ్చిందని.. అప్పుడే క్షణం సినిమా కథ రాసుకున్నట్లు చెప్పారు.