పోలీసుల ఒత్తిడితో ఆ వీడియో డిలీట్ చేసిన సింగర్

Update: 2020-07-11 06:50 GMT
తమిళనాడులో గత కొన్ని రోజులుగా జయరాజ్.. బెనిక్స్ లాకప్ డెత్ విషయమై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరూ తమ షాప్ ఓపెన్ చేశారని పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఏమి జరిగిందో ఏమో కాని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పోలీసుల లాకప్ లో మృతి చెందారు. విచారణలో వారిద్దరూ లాకప్ డెత్ అయినట్లుగా తేలింది.

ఆ విషయమై తమిళ సినిమా ప్రముఖులు పలువురు స్పందించారు. పోలీసుల తీరుపై చాలా సీరియస్ అయ్యారు. ఇద్దరి మృతికి కారణం అయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సింగర్ సుచిత్ర సంఘటనపై పలు విషయాలను సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోను కూడా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సింగర్ సుచిత్ర షేర్ చేసిన వీడియో ఇంకా ఇతర విషయాలు ప్రస్తుతం జరుగుతున్న కేసు విచారణను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో సుచిత్ర ఆ పోస్ట్ లను డిలీట్ చేసింది.
Tags:    

Similar News