అజ్ఞాతవాసి హడావిడి మాములుగా లేదు

Update: 2017-12-03 02:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో బిజినెస్ వ్యవహారాల గురించి అనేక చర్చలు సాగుతున్నట్లు కథనాలు బాగానే వెలువడుతున్నాయి. సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో గాని ఇప్పుడు చేస్తున్న హడావిడి బారి స్థాయిలో అంచనాలను రేపుతోంది. సినిమాకి సంబందించిన ప్రతి చిన్న విషయంలో ఎదో ఒక రూపంలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి జోరుగా ప్రచారం సాగుతోంది.

సినిమా మొత్తంగా రూ.130 కోట్లతో తెరకెక్కగా రూ.150 కోట్ల బిజినెస్ అవ్వడం ఖాయమని అంచనాలను వేస్తున్నారు. ఇక సినిమాకి ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో నిర్వహించాలని చూస్తున్నారు. ముఖ్యంగా అజ్ఞాతవాసి బ్రాండింగ్ ఎక్కువగా పెరగాలని హైదరాబాద్ - విశాఖ అండ్  హైదరాబాద్ - బెంగళూరుకు వెళ్లే రెండు ఫ్లయిట్ లను యాడ్లతో కప్పేయాలని త్రివిక్రమ్ టీమ్ ఆలోచిస్తోందట. అంతే కాకుండా 14మెట్రో రైళ్లలో ప్రమోషన్స్ పెరిగేలా బ్రాండింగ్ చేయనున్నారట.

ఇకపోతే సినిమా స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లేలా భారీ స్థాయిలో ఆడియో ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతి  అమరావతి అని చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఫైనల్ గా హైదరాబాద్ లోనే నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆడియో వేడుకను నిర్వహించడానికి కొత్తగా టెండర్లు వేసే ఆలోచనలో నిర్మాత ఆలోచిస్తున్నారట. పెద్ద సినిమాలకు కోటి ఖర్చైనా మేము భరిస్తామని వచ్చేవారు చాలా మంది ఉన్నారు. దీంతో అజ్ఞాతవాసి ఆడియో కూడా అదే తరహాలో రెడీ అవుతోందని తెలుస్తోంది. 
Tags:    

Similar News