'ఆహా' కోసం స్టార్ హీరో రంగంలోకి దిగేస్తున్నారా?

Update: 2022-01-20 06:53 GMT
తెలుగు ఓటీటీ దిగ్గ‌జం `ఆహా` అన‌తి కాలంలోనే త‌న స‌త్తాని చాటుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ , ఆక‌ట్టుకునే వెబ్ సిరీస్ ల‌తో టాప్ లో నిలిచిన ఆహా ఓటీటీ నంద‌మూరి న‌ట‌సింహం హీరో బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె` టాక్ షోతో దేశ వ్యాప్తంగా టాప్ లో నిలిచి సంచ‌ల‌నం సృష్టించింది.

ఈ షో వ‌ల్ల ఆహా కు మ‌రింత మైలైజ్ పెరిగింది. బాల‌య్య సెల‌బ్రిటీల‌ని ఇంట‌ర్వ్యూ చేస్తున్న తీరు.. ఈ స‌మ‌యంలో ఆయ‌న వ్య‌వంహ‌రిస్తున్న విధానం ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటూ టాక్ షోని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌బెట్టింది.

బాల‌య్య టాక్ షో బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ఇంత‌కు మించిన టాక్ షోని మ‌రింత కొత్త‌గా మ‌రింత భారీగా ఆహా టీమ్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. సెల‌బ్రిటీ టాక్ షోగా పాపుల‌ర్ అయినా దీనికి మ‌రిన్ని హంగులు అద్ది స‌రికొత్త పేరుతో మ‌రో స్టార్ తో స‌రికొత్త కాన్సెప్ట్ తో మ‌రో టాక్ షోని ప్లాన్ చేస్తున్నారు ఆహా వ‌ర్గాలు. అయిత ఇందు కోసం ఏకంగా క్రేజీ స్టార్ నే రంగంలోకి దించేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అన్ స్టాప‌బుల్ పేరుతో ఈ షోని మ‌రింత కొత్త‌గా ప్లాన్ చేస్తున్న మేక‌ర్స్ ఈ షో కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని స్వ‌యంగా రంగంలోకి దింపేస్తున్నార‌ట‌. రీసెంట్ గా `పుష్ప ది రైజ్‌`తో అల్లు అర్జున్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని పాన్ ఇండియా స్థాయిలో సొంతం చేసుకుని పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌రాదిలో బ‌న్నీ క్రేజ్ కి ఈ మూవీ అద్దంప‌ట్టింది. ఎలాంటి ప్ర‌చారం చేయ‌క‌పోయినా బ‌న్నీ సినిమాకు ఉత్త‌రాది ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డంతో బ‌న్నీ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది.

300 కోట్ల పైచిలుకు వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా ఉత్త‌రాది బాక్సాఫీస్ వ‌ద్ద 85 కోట్ల మార్కుని దాటి ట్రేడ్ పండితుల్ని విస్మ‌యానికి గురిచేసింది. ఇదే క్రేజ్ ని `ఆహా` ఓటీటీ కోసం వాడుకోవాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆ కార‌ణంగానే బ‌న్నీని తాజా టాక్ షో కోసం హోస్ట్ గా రంగంలోకి దించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్ ల‌తో టాక్ షోలో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించారు.

అయితే బ‌న్నీ హోస్ట్ గా వ్వ‌వ‌హ‌రించే టాక్ షో కోసం మాత్రం పాన్ ఇండియా స్థాయిలో వున్న ఆర్టిస్ట్ ల‌తో నిర్వహించ‌బోతున్నార‌ట‌. ఇందు కోసం అన్ని భాష‌ల‌కు చెందిన స్టార్ ల‌కు ఆహ్వానాలు అందించ‌బోతున్నార‌ని, వారిని బ‌న్నీ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించే టాక్ షో కు గెస్ట్ లుగా ఆహ్వానించి పాన్ ఇండియా రేంజ్ టాక్ షోగా దీన్ని మ‌ల‌చ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ఈ టాక్‌ షో కోసం ఇప్ప‌టికే ప్ర‌త్యేక‌మైన టీమ్ ని కూడా సిద్ధం చేసిన‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇది ఎప్పుడు మొద‌ల‌వుతుంది? .. ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Tags:    

Similar News