టైగర్‌ స్పెషల్‌: మరో అసిస్టెంట్‌ కూడా కొట్టాడా?

Update: 2015-06-26 11:24 GMT
టాలీవుడ్‌లో ఏ స్టార్‌ డైరెక్టర్‌ శిష్యుడైనా డైరెక్టర్‌ అయ్యాడా? అయినా నిరూపించుకున్నాడా? అస్సలు ఛాన్సే లేదు. ఇంతవరకూ తెలుగు సినీపరిశ్రమ హిస్టరీలోనే ఇలాంటిది జరగలేదు. ముఖ్యంగా ఇప్పుడున్న స్టార్‌ డైరెక్టర్ల లిస్ట్‌ తిరగేస్తే అందులో ఒక్కరి శిష్యుడు కూడా స్టార్‌ డైరెక్టర్‌ అయిన పాపాన పోలేదు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి, త్రివిక్రమ్‌, శ్రీనువైట్ల, సుకుమార్‌, వి.వి.వినాయక్‌ ఇలాంటి దిగ్గజాల దగ్గర పనిచేసిన వాళ్లెందరో దర్శకులైతే అయ్యారు కానీ, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి గురువును మించిన శిష్యుడయ్యాడు అని చెప్పుకోలేని పరిస్థితి.

కానీ కోలీవుడ్‌లో సీనే వేరు. అక్కడ స్టార్‌ డైరెక్టర్ల శిష్యులు కూడా స్టార్‌ డైరెక్టర్లు అవుతున్నారు. అయ్యి చూపిస్తున్నారు. అంతేనా అలా తమ శిష్యులు స్టార్‌ డైరెక్టర్లుగా ఎదగడానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను సదరు సీనియర్‌ దర్శకులే చేస్తున్నారు. శరవణన్‌, అట్లీ, వి.ఐ.ఆనంద్‌ ఇలా తిరగేస్తే చాంతాడంత జాబితా ఉంది. ఒక్క మురుగదాస్‌ విషయమే తీసుకుంటే ఆయన నుంచి వచ్చిన వారిలో శరవణన్‌ పెద్ద స్థాయి దర్శకుడిగా నిరూపించుకున్నాడు. అప్పట్లో జర్నీలాంటి హిట్‌ సినిమాని తీశాడు ఈ దర్శకుడు. అట్లీ లాంటి దర్శకుడు రాజా రాణి లాంటి సినిమా తీసి హిట్‌ కొట్టాడు.

ఇప్పుడు మళ్లీ మరో దర్శకుడు మురుగదాస్‌ వద్ద నుంచి వచ్చాడు. సందీప్‌ కిషన్‌తో టైగర్‌ సినిమా తీసి నిరూపించుకున్నాడు. ఈ సినిమా తొలిరోజు ఎబోవ్‌ యావరేజ్‌ టాక్‌నే తెచ్చుకుంది. ఇలా టాలీవుడ్‌ నుంచి కూడా కొత్త దర్శకుల ప్రవాహం పెరగాలంటే తమ శిష్యులకు మన స్టార్‌ డైరెక్టర్లు చుక్కానీలా మారాలి. శిష్యులకు వెన్నుదన్నుగా నిలిచి మార్గం చూపిస్తేనే అది సాధ్యం.

Tags:    

Similar News