జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో రిషి కపూర్ రాసిన పుస్తకమే హాట్ టాపిక్. ఎంత పెద్ద స్టార్స్ అయినా.. వారి పిల్లలు అయినా సహజంగా అందరికీ ఉండే కష్టాలు అనుభవాలు ఉంటాయని చెప్పారు. అయితే.. ఇదే కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యా ధనుష్ రాసిన బుక్ యాపిల్ బాక్స్-ది స్టోరీ ఆఫ్ ఏ గాళ్ ను కూడా ఉంచారు.
తను పుస్తకం రాయడం వెనక బోలెడన్ని సంగతులు చెప్పింది ఐశ్వర్య. సూపర్ స్టార్ డాటర్ కావడంతో.. చిన్నప్పటి నుంచి తనను మీడియాకు దూరంగానే తన తండ్రి ఉంచారని చెప్పింది ఐశ్వర్య. అంతే కాదు.. ధనుష్ ను పెళ్లి చేసుకునే విషయంలో కూడా డేటింగ్ కు అవకాశం చిక్కలేదంట. ఒకరి గురించి ఒకరు పెళ్లి తర్వాతే తెలుసుకున్నారట. అయితే.. పుస్తకం రాయడానికి కారణం మాత్రం తన సొంత అనుభవాలే అని చెప్పింది ఐశ్వర్యం.
చిన్నప్పటి నుంచి ఎక్కువమందితో మాట్లాడే అవకాశం లేకపోవడంతో.. తాను ఎవరికి ఏం చెప్పాలని అనుకున్నా ఓ పేపర్ పై రాయడం బాగా అలవాటు చేసుకుందట. ఆ తర్వాత వాటిని పారేసినా.. రాయడం మాత్రం మానలేదట. తను రాసిన పుస్తకంలో.. రీ రైట్ చేసినవి ఏవీ ఉండవని.. ప్రజలకు ఏం కావాలని కోరుకుంటారో తనకు అవగాహన ఉందని చెప్పింది ఐశ్వర్యా ధనుష్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/