ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కు మరో పురస్కారం లభించింది. నటిగా ఇప్పటికే ఆమె సాధించిన పేరు ప్రఖ్యాతుల సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా సినీరంగానికి ఆమె అందిస్తున్న సేవలను గుర్తిస్తూ.. ఆమెకు ఫస్ట్ లేడీ అవార్డును ప్రకటించారు.
రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఫస్ట్ లేడీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. పలు రంగాల్లో ఘన విజయం సాధించిన కొందరు మహిళల్ని ఎంపిక చేస్తుంటారు. అందులో భాగంగా సినిమా రంగానికి సంబంధించి ఐశ్వర్యారాయ్ ను ఫస్ట్ లేడీగా పురస్కారాన్ని అందజేశారు. గడిచిన పదహారేళ్లుగా ప్రతి ఏటా కేన్స్ చలనచిత్రోత్సవాలకు ఐష్ హాజరవుతున్నారు.
ఇటీవల ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఐష్ తోపాటు చిన్న వయసులోనే పైలెట్ అయిన ఆయేషా.. అజీజ్.. తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి రువేదా సలామ్ లతో పాటు మరో 113 మందికి ఈ పురస్కారాన్ని అందజేశారు.